కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటనలో ప్రోటోకాల్ వివాదం చోటు చేసుకొంది. తన పర్యటనకు అధికారులు రావడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

హైదరాబాద్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటనలో ప్రోటోకాల్ వివాదం చోటు చేసుకొంది. తన పర్యటనకు అధికారులు రావడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైద్రాబాద్ నగరంలోని వరద ప్రాంతాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గురువారంనాడు ఉదయం నుండి పర్యటిస్తున్నారు. ఇవాళ ఉదయం ఖైరతాబాద్ ప్రాంతంలో పర్యటించే సమయంలో జీహెచ్ఎంసీ అధికారులు రాకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ కు ఫోన్ చేశాడు. 

ఆ తర్వాత మధ్యాహ్నం నుండి ఆయన తన పర్యటనను కొనసాగిస్తున్నాడు. అయితే మధ్యాహ్నం పర్యటనలో కూడ అధికారుల నుండి సరైన స్పందన లేదని ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

Scroll to load tweet…

తన పర్యటనలో ఆర్డీఓ స్థాయి అధికారులు హాజరుకాకపోవడంపై ఆయన మండిపడ్డారు. తన పర్యటనలో ఎమ్మార్వోలు పాల్గొనడంపై ఆయన ఉన్నతాధికారులకు ఫోన్ చేశారు.