తెలంగాణకు చెందిన కొందరు బీజేపీ  కార్పోరేటర్ల తీరుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరిపై ఫిర్యాదులు అందుతున్నాయని.. ముందు మీ ప్రాంతంలోని సమస్యలపై పోరాడాలని ఆయన హెచ్చరించారు. 

బీజేపీకి చెందిన కొందరు కార్పోరేటర్లపై మండిపడ్డారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కొత్త భవన నిర్మాణాల జోలికి వెళ్లవద్దని ఆయన హెచ్చరించారు. తనకు ఎన్నో ఫిర్యాదులు అందాయని.. మీ ప్రాంత సమస్యలపై ముందు పోరాడాలని కిషన్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయం నడుస్తోందని.. ఎమ్మెల్యేలు, మంత్రుల వేధింపులు పెరిగిపోయాయని ఆయన అన్నారు. రైస్, లిక్కర్, మైన్స్, సాండ్, ల్యాండ్ మాఫియా విచ్చలవిడిగా సాగుతోందని కిషన్ రెడ్డి ఆరోపించారు. 

మరోవైపు మంత్రి కేటీఆర్ సవాల్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (kishan reddy) స్పందించారు. సీఎం కేసీఆర్‌తో (kcr) బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. ఎనిమిదేళ్లుగా మీరెంత ఖర్చు చేశారో... కేంద్రం ఎంత ఖర్చు చేసిందో చర్చకు సిద్ధమా అని ఆయన సవాల్ విసిరారు. సాయి గణేష్ ఆత్మహత్య (sai ganesh suicide) చేసుకున్న చోటే.. టీఆర్ఎస్‌ను భూస్థాపితం చేస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. సచివాలయం లేని రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని... తాము ఎవ్వరినీ వదిలి పెట్టమని ఆయన హెచ్చరించారు. పోలీసులు లక్ష్మణ రేఖ దాటొద్దని.. సాయి గణేష్ ఆత్మహత్యు ప్రభుత్వానిదే బాధ్యతని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తుమ్మల హయాంలోనే ఖమ్మం (khammam) అభివృద్ధి జరిగిందని.. ఖమ్మంలో మీరేం చేశారో చెప్పాలంటూ కేంద్ర మంత్రి డిమాండ్ చేశారు. తెలంగాణలో బీజేపీ గెలవబోతోందని కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు. 

కాగా.. కొద్దిరోజుల క్రితం (bjp) బీజేపీకి (trs) టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (ktr) సవాల్ విసిరారు. తాను చెప్పింది రుజువు చేస్తే సాధారణ ఎమ్మెల్యేగానే కొనసాగుతానన్నారు. కేంద్రానికి రూ.3,65,797 కోట్లు ఇచ్చామని.. తెలంగాణకు కేంద్రం ఇచ్చింది రూ.కోటి 65 లక్షలు మాత్రమేనన్నారు. దమ్ముంటే బీజేపీ నాయకులు రుజువు చేయాలని కేటీఆర్ సవాల్ విసిరారు. ఎవరి సొమ్ము ఎవరు తింటున్నారని ఆయన ఫైర్ అయ్యారు. అటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (bandi sanjay), టీపీసీసీ (tpcc) చీఫ్ రేవంత్ రెడ్డిలపై (revanth reddy) ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి కేటీఆర్.