Asianet News TeluguAsianet News Telugu

రీజినల్ రింగ్ రోడ్డుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

 తెలంగాణ రాష్ట్రానికి రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సూత్ర ప్రాయంగా అంగీకారం తెలిపిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.

union minister Kishan Reddy clarifies on Regional ring Road lns
Author
Hyderabad, First Published Feb 22, 2021, 6:37 PM IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సూత్ర ప్రాయంగా అంగీకారం తెలిపిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.

సోమవారం నాడు  న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు.  రూ. 10 వేల కోట్లతో 155 కి,మీ మేర రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్టుగా చెప్పారు.. ఈ రింగ్ రోడ్డు నిర్మాణం తెలంగాణ అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ గా మారనుందన్నారు.రెండు భాగాలుగా  రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నట్టుగా ఆయన చెప్పారు. ఉత్తర, దక్షిణ భాగాలుగా ఈ రింగ్ రోడ్డు నిర్మాణాలు ఉంటాయని ఆయన తెలిపారు.

రీజినల్ రింగ్ రోడ్డుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఈ రింగ్ రోడ్డు నిర్మాణానికి  కేంద్రం సానుకూలంగా స్పందించింది.ఈ రింగ్ రోడ్ల నిర్మాణం పూర్తైతే అభివృద్ది మరింత వేగవంతం కానుందని నిపుణులు చెబుతున్నారు.

భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని రీజినల్ రింగ్ రోడ్డును ప్రభుత్వం ప్రతిపాదించింది. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు రీజినల్ రింగ్ రోడ్డు ద్వారా మరిన్ని ప్రాంతాలు అభివృద్ది అయ్యే అవకాశాలున్నాయని రియల్టర్లు చెబుతున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios