నేడు హైద్రాబాద్ కు అమిత్ షా: షెడ్యూల్‌లో మార్పులు, ఆ రెండు కార్యక్రమాలు రద్దు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేడు హైద్రాబాద్ కు రానున్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా టూర్ లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.
హైదరాబాద్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదివారంనాడు హైద్రాబాద్ కు రానున్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటనలో స్పవల్పమార్పులు చోటు చేసుకున్నాయి. ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు అమిత్ షా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుండి అమిత్ షా చేవేళ్ల లో నిర్వహించే బహిరంగ సభళో పాల్గొంటారు. హైద్రాబాద్ నుండి రోడ్డు మార్గంలో అమిత్ షా చేవేళ్ల చేరుకుంటారు. చేవేళ్లలో బీజేపీ బహిరంగ సభలో అమిత్ షా పాాల్గొంటారు. రాత్రి 7:50 గంటలకు అమిత్ షా హైద్రాబాద్ నుండి తిరిగి న్యూఢిల్లీకి వెళ్తారు. రెండు రోజుల క్రితం ప్రకటించిన షెడ్యూల్ కంటే గంటన్నర ఆలస్యంగా అమిత్ షా హైద్రాబాద్ చేరుకుంటారు.
రెండు రోజుల క్రితం ప్రకటించిన షెడ్యూల్ సాయంత్రం మూడున్నర గంటలకే అమిత్ షా హైద్రాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరకుుంటారు. అక్కడి నుండి నోవాటెల్ హోటల్ కు చేరుకుంటారు. నోవాటెల్ హోటల్ లో ఇటీవలే ఆస్కార్ అవార్డు గెలుచుుకున్న ఆర్ఆర్ఆర్ టీమ్ సభ్యులతో అమిత్ షా భేటీ కానున్నారు. ఆర్ఆర్ఆర్ టీమ్ సభ్యులతో తేనీటి భేటీ ఉంటుందని ప్రకటించారు. అయితే తాజాగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారంగా ఆర్ఆర్ఆర్ టీమ్ తో భేటీ రద్దైంది.
అనంతరం బీజేపీ రాష్ట్ర నేతలతో జరిగే సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఇతర అంశాలపై అమిత్ షా చర్చించనున్నారు. అయితే ఈ కార్యక్రమాన్ని కూడా రద్దు చేశారు. అమిత్ షా ఆలస్యంగా హైద్రాబాద్ కు వస్తున్న నేపథ్యంలో ఈ రెండు కార్యక్రమాలు రద్దయ్యాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
హైద్రాబాద్ కు చేరుకున్న తర్వాత నేరుగా చేవేళ్ల బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారు. బీజేపీ పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా చేవేళ్లలో నిర్వహించే సభలో అమిత్ షా పాల్గొంటారు.
ఈ ఏడాది మే మాసంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. . తెలంగాణలో అధికారంలోకి రావాలని ఆ పార్టీ ఇప్పటినుండే వ్యూహలు రచిస్తుంది. కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణపై బీజేపీ ఫోకస్ చేయనుంది,. ఇప్పటికే బీజేపీ అగ్రనేత సునీల్ భన్సల్ తెలంగాణలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. రానున్న రోజుల్లో బీజేపీ అగ్రనేతలు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించే అవకాశం ఉంది.