హైద‌రాబాద్ కు అమిత్ షా.. కేంద్ర‌మంత్రి రాక‌తో చేవ‌ళ్ల స‌భ‌పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి..

Hyderabad: తెలంగాణలోని చేవెళ్ల‌లో ఆదివారం (ఏప్రిల్ 23న) జరిగే బహిరంగ సభలో అమిత్ షా పాలుపంచుకోనున్నారు. ఇటీవలి కాలంలో అధికార టీఆర్ఎస్, బీజేపీల మధ్య రాజకీయ విభేదాలు తారాస్థాయికి చేరుకోవడంతో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం నిత్యకృత్యంగా మారింది. ఈ స‌మ‌యంలో అమిత్ షా హైద‌రాబాద్ కు రావ‌డంపై ఆస‌క్తి నెల‌కొంది. 
 

Union Minister Amit Shah to visit Hyderabad on April 23; there is a lot of interest in the Chevella public meeting RMA

Union Home Minister Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైద‌రాబాద్ కు రానున్నారు. రాష్ట్రంలోని చేవెళ్ల‌లో ఆదివారం జరిగే బహిరంగ సభలో అమిత్ షా పాలుపంచుకోనున్నారు. ఇటీవలి కాలంలో అధికార టీఆర్ఎస్, బీజేపీల మధ్య రాజకీయ విభేదాలు తారాస్థాయికి చేరుకోవడంతో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం నిత్యకృత్యంగా మారింది. ఈ స‌మ‌యంలో అమిత్ షా న‌గ‌రానికి ద్ కు రావ‌డంపై ఆస‌క్తి నెల‌కొంది. 

వివ‌రాల్లోకెళ్తే.. ఈ నెల 23న (ఆదివారం) చేవెళ్లలో జరిగే బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగిస్తారని బీజేపీ వర్గాలు శనివారం తెలిపాయి. 'పార్లమెంట్ ప్రభాస్ యోజన' కార్యక్రమంలో భాగంగానే ఆయన పర్యటనకు వ‌స్తున్నార‌ని తెలిపారు. తన పర్యటనలో భాగంగా 'ఆర్ఆర్ఆర్' మూవీ టీమ్ లోని కీలక సభ్యులను అమిత్ షా కలిసే అవకాశం ఉంది. ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డును గెలుచుకున్నందుకు చిత్రబృందాన్ని బీజేపీ నేత సన్మానించనున్నారని సంబంధిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి. 

'ఆర్ఆర్ఆర్' చిత్రంలోని 'నాటు నాటు' పాట ఈ ఏడాది ఆస్కార్ ఈవెంట్లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డును గెలుచుకుంది. ఈ క్ర‌మంలోనే అమిత్ షా ఆర్ఆర్ఆర్ టీమ్ ను స‌న్మానించ‌నున్నార‌ని తెలిసింది. కాగా, అమిత్ షా ఎప్పుడు ఎక్కడికి వెళ్లినా ప్రముఖులను కలవడానికి ప్రయత్నిస్తారని, అందులో భాగంగానే గత ఏడాది తన తెలంగాణ‌ పర్యటనల సందర్భంగా నటులు జూనియర్ ఎన్టీఆర్, నితిన్ తదితరులను మంత్రి కలిశారని పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు.

కాగా, మే 10న పొరుగున ఉన్న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత కాషాయ పార్టీ తెలంగాణలో మరింత దృష్టి సారించి ప్రచారాన్ని ముమ్మరం చేస్తుందని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఇటీవలి కాలంలో అధికార టీఆర్ఎస్, బీజేపీల మధ్య రాజకీయ విభేదాలు తారాస్థాయికి చేరుకోవడంతో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం నిత్యకృత్యంగా మారింది. బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదగడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని, గత మూడేళ్లలో జరిగిన రెండు అసెంబ్లీ ఉప ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో జాతీయ పార్టీ సహేతుకమైన విజయం సాధించిందన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios