బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్య చేసుకొన్న ఘటనపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరా తీశారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వేధింపులకు గురి చేశాడని ఆసుపత్రిలో చికిత్స పొందే సమయంలో సాయి గణేష్ మీడియాకు చెప్పారు.
ఖమ్మం: ఆత్మహత్య చేసుకొన్న BJP కార్యకర్త Sai Ganesh కుటుంబ సభ్యులకు కేంద్ర హోంశాఖ మంత్రి Amit Shah మంగళవారం నాడు ఫోన్ చేశారు. సాయి గణేష్ కుటుంబ సభ్యులను ఈ ఘటన గురించి వివరాలు అడిగి తెలుసుకొన్నారు.ఇవాళ సాయి గణేష్ కుటుంబ సభ్యులను బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి పరామర్శించారు. సాయి గణేష్ ఆత్మహత్య విషయమై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. అమిత్ షా సాయి గణేష్ కుటుంబ సభ్యులతో అమిత్ షా మాట్లాడారు
సాయి గణేష్ కుటుంబ సభ్యులను మంత్రి ఓదార్చారు. ఈ నెల 14వ తేదీన ఖమ్మం త్రీటౌన్ పోలీస్ స్టేషన్ ముందు సాయి గణేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 16న సాయి గణేష్ మరణించాడు. ఆసుపత్రిలో చికిత్స పొందే సమయంలో సాయి గణేష్ మీడియాతో మాట్లాడారు. తనపై మంత్రి Puvvad Ajay Kumar అక్రమంగా 16 కేసులు నమోదు చేయించారని చెప్పారు. ఈ వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టుగా సాయి గణేష్ చెప్పారు. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు సాయి గణేష్ నుండి మరణ వాంగ్మూలం ఎందుకు తీసుకోలేదని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
సాయి గణేష్ మీడియాకు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై కేసు నమోదు చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.ఈ విషయమై ఆందోళనలు చేస్తున్నారు.సాయి గణేష్ ఆత్మహత్యతో ఖమ్మంలో ఉద్రిక్తత నెలకొంది. దీంతో ఖమ్మం టూర్ ను మంత్రి కేటీఆర్ రద్దు చేసుకొన్నారు. పార్టీ కార్యక్రమాలతో పాటు ఇతరత్రా కార్యక్రమాలున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఖమ్మం టూర్ రద్దైందని TRS నేతలు ప్రకటించారు.
సాయి గణేష్ ఆత్మహత్య తర్వాత ఖమ్మంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకొన్నాయి. ఖమ్మంలో మంత్రి ఫ్లెక్సీలను బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఆసుపత్రిపై కూడా ధ్వంసం చేశారు. మరో వైపు ఎఫ్ఐఆర్ ను నమోదు చేయని విషయమై కూడా బీజేపీ నేతలు ఆందోళనలు చేస్తున్నారు. ఇవాళ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దృష్టికి బీజేపీ నేతలు తీసుకొచ్చారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలపై కూడా కేసులు బనాయించారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై ఆ పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు, ఆ నేతలపై కేసులు నమోదు చేశారు. ఈ విషయమై కాంగ్రెస్ నేతలు కూడా న్యాయ పోరాటం చేస్తున్నారు. ప్రత్యర్ధి పార్టీల నేతలపై కేసులు బనాయిస్తూ ఇబ్బంది పెడుతున్నారని అజయ్ కుమార్ పై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.
