Asianet News TeluguAsianet News Telugu

ఈఎస్ఐ స్కామ్ లో ట్విస్ట్, కేంద్ర నిధులు సైతం బొక్కేసిన వైనం

ప్రతీఏటా కేంద్రం విడుదల చేసే రూ.100 కోట్లకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. కేంద్రం విడుదల చేసిన రూ.100 కోట్లు ఏమయ్యాయో అన్న కోణంలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టగా ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో ఖంగుతిన్నారు. 

union government enquiry about esi scam in telangana
Author
Hyderabad, First Published Oct 12, 2019, 3:11 PM IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ స్కామ్ కేసులో మరో కొత్త ట్విస్ట్ నెలకొంది. ఈఎస్ఐ ఆస్పత్రుల మౌళిక వసతుల కోసం, సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే రూ.100 కోట్లు హాంఫట్ అయినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. 

ఈఎస్ఐ స్కామ్ ను ఛాలెంజ్ గా తీసుకున్న ఏసీబీ అధికారులు గత కొద్దిరోజులుగా లెక్కలు తిరగదోడుతున్నారు. ఇప్పటికే విధ కార్యాలయాలతోపాటు ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ, కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. 

అయితే శనివారం నిర్వహించిన సోదాల్లో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రతీఏటా కేంద్రం విడుదల చేసే రూ.100 కోట్లకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు.

కేంద్రం విడుదల చేసిన రూ.100 కోట్లు ఏమయ్యాయో అన్న కోణంలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టగా ఎలాంటి ఆచూకీ లభించకపోవడంతో ఖంగుతిన్నారు. నిధులు గోల్ మాల్ పై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

ఈఎస్ఐ స్కామ్ పై వివరాలు అడిగి తెలుసుకుందని తెలుస్తోంది. ఇకపోతే కేంద్రప్రభుత్వం ప్రతీఏడాది ఈఎస్ఐ ఆస్పత్రుల కోసం ఇచ్చే రూ.100 కోట్లు కూడా పక్కదారి పట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios