కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్  రాష్ట్రంలో టీఆర్ఎస్,బీజేపీ ల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. రాష్ట్రానికి నిధులు కేటాయించడం లేదని టిఆర్ఎస్ విమర్శిస్తుంటే .....బిజెపి మాత్రం కేంద్రం నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఎలాంటి జరుగుతున్నాయని బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఇటీవలే మున్సిపల్ ఎన్నికలు ముగియడంతో నిన్న మొన్నటి వరకు ఎన్నికల వేడిలో ఉన్న నేతలు ఇప్పుడు  రాజకీయాలపై దృష్టి  పెట్టారు.

 కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్తో  రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడి పోయే అవకాశం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు నిధుల కేటాయింపు లేక మందగమనం ఏర్పడే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.

 గత ఏడాది కూడా కేంద్రం నిధులు ఇస్తామని హామీ ఇచ్చినా ఆ స్థాయిలో  నిధులు  ఇవ్వలేదని సీఎం కేసీఆర్ లెక్క తేల్చి చెప్పారు.

 కాబోయే ముఖ్యమంత్రి అంటూ ప్రచారం జరుగుతున్న కేటీఆర్ మరో అడుగు ముందుకేసి బిజెపి నేతలకు దమ్ముంటే కేంద్రం నుంచి నిధులు తీసుకు రావాలని సవాల్ విసురుతున్నారు. రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నిధుల కంటే ఒక్క రూపాయి కూడా అదనంగా నిధులు ఇవ్వడంలేదని, బీజేపీ ఆరు  బడ్జెట్ లలో   తెలంగాణలో ఇదే పరిస్థితి నెలకొందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

 కేటీఆర్ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న బీజేపీ నేతలు అంతే ఘాటుగా స్పందిస్తున్నారు. 

 దమ్ముంటే బిజెపి రాష్ట్రానికి కేటాయించిన నిధులు పై చర్చకు రావాలని సవాల్ విసురుతున్నారు. రావాల్సిన నిధులకంటెటే 7 రేట్లు అదనంగా నిధులను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిదని బిజెపి నేతలు చెబుతున్నారు. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్  కెటిఆర్ కు సవాల్ విసురుతున్నారు.   

నిధుల కేటాయింపు  విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రప్రభత్వం వైఫల్యమని ఎత్తి చూపించేందుకు ప్రయత్నిస్తుండగా... కేంద్ర ప్రభుత్వం ఎలాంటి వివక్ష చూపించడం లేదని చెప్పుకునేందుకు రాష్ట్ర  బిజెపి నేతలు సిద్ధమవుతున్నారు.

 మొత్తంమీద ఇరు పార్టీల నేతలు చేస్తున్న వ్యాఖ్యలు పొలిటికల్ హిట్ రేపుతున్నాయి