కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రంపై చిన్నచూపు చూసినట్లుగా ఉంది. త్వరలో లోక్ సభ ఎన్నికలు జరిగనున్న నేపథ్యంలో కేంద్రం తాత్కాలిక బడ్జెట్ ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. కేవలం ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రజలను ఆకర్షించినట్లుగా బడ్జెట్ తయారు చేసినట్లుగా ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అంతేకాదు.. మోదీ ప్రభుత్వం కొత్తగా ఒక్క పథకాన్ని కూడా ప్రవేశపెట్టలేదని.. తెలంగాణలో కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు పథకాన్ని కాపీ కొట్టారనే విమర్శలు వినపడుతున్నాయి. 

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు కేటాయింపులు..

సింగరేణి-రూ.1850 కోట్లు
ఐఐటీ హైదరాబాద్‌-రూ.80కోట్లు
ట్రైబల్‌ యూనివర్సిటీ-రూ.4కోట్లు