ప్రభుత్వ ఉద్యోగం రాలేదని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహబూబాబాద్‌ జిల్లాలో చోటు చేసుకొంది.  

మహబూబాబాద్: ప్రభుత్వ ఉద్యోగం రాలేదని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మహబూబాబాద్‌ జిల్లాలో చోటు చేసుకొంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

 మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు మండలంలో చోటుచేసుకుంది.తేజావత్ రామ్ సింగ్ తండాకు చెందిన బోడ సునీల్ అనే యువకుడు ప్రభుత్వ ఉద్యోగం కోసం చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ ఆయనకు ఉద్యోగం రాలేదు. దీంతో మనస్థాపానికి గురైన సునీల్ ఈ ఏడాది మార్చి 27న కాకతీయ యూనివర్శిటీ వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు అతడిని మెరుగైన చికిత్స కోసం ఏంజీఎం ఆసుపత్రికి తరలించారు.

ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడి పరిస్థితి విషమించింది. దీంతో మెరుగైన చికిత్స కోసం ఆయనను మార్చి 28న నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. నిమ్స్ లో చికిత్స పొందుతూ సునీల్ ఈ నెల 1వ తేదీన మరణించాడు.

ఆత్మహత్యాయత్నానికి ముందు సునీల్ సెల్పీ వీడియో తీసుకొన్నాడు. ప్రభుత్వ ఉద్యోగం రాకపోవడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్టుగా ఆయన తెలిపారు.

సునీల్ మృతదేహాన్ని గ్రామానికి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు