Asianet News TeluguAsianet News Telugu

‘నోటిఫికేషన్ లేవు.. పిచ్చిలేస్తోంది. కేసీఆర్, కరోనా కారణం’.. వాట్సాప్ స్టేటస్ పెట్టి నిరుద్యోగి ఆత్మహత్య...

సాగర్ చదువులో చురుగ్గా ఉండేవాడు. ఐదేళ్లుగా ఖమ్మంలోనే ఉంటున్నాడు.  ఓ ప్రైవేట్ కాలేజీలో 2019లో డిగ్రీ పూర్తి చేశాడు.  స్నేహితులతో కలిసి గది అద్దెకి తీసుకుని ఉంటున్నాడు. మూడు నెలల క్రితం వారు వెళ్లిపోవడంతో.. ఒక్కడే కాలం గడుపుతున్నాడు.  జేబు ఖర్చులకు డబ్బు పంపే స్థోమత తల్లిదండ్రులకు లేదని..  వారికి భారం కాకూడదని  ఖాళీ సమయంలో  క్యాటరింగ్ పనులకు వెళ్లేవాడు.  

unemployed graduate ends life in Khammam
Author
Hyderabad, First Published Jan 26, 2022, 8:59 AM IST

ఖమ్మం : తెలంగాణలో నిరుద్యోగులు వరుసగా ఆత్మహత్యలకు పాల్పడడం కలకలం రేపుతోంది job notifications వెలువడక ఎస్సై కావాలన్న తన కల సాకారం కాదేమోనని ఓ పేద కుటుంబంలోని unemployee బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసు ఉద్యోగం కోసం చిన్నప్పటి నుంచి పరితపించిన అతడు  nccలోనూ c certificate సంపాదించాడు.  రెండున్నరేళ్లుగా ఓ ప్రైవేటు సంస్థలో శిక్షణ తీసుకుంటున్న ముత్యాల సాగర్ (24)  మంగళవారం తెల్లవారుజామున  Khammam మామిళ్లగూడెం వద్ద రైలు కిందపడి suicide చేసుకున్నాడు.  

అతడి స్వస్థలం మహబూబాబాద్ జిల్లా బయ్యారం. సోమవారం అర్ధరాత్రి రెండు గంటల 45 నిమిషాలకు అతడు మొబైల్ లోనే whatsapp statusలో... ‘నోటిఫికేషన్ లేవు.. పిచ్చిలేస్తోంది. కేసీఆర్, కరోనా కారణం’ అని ఉండటాన్ని పోలీసులు గుర్తించారు.

డబ్బులు  పంపే స్తోమత తల్లిదండ్రులకు లేదని..
సాగర్ తండ్రి భద్రయ్య హమాలీ.  తల్లి కళమ్మ కూలీ.  వీరికి కుమారుడు,  కుమార్తె సంతానం. రెండేళ్ల కిందట కూతురు సౌజన్య వివాహం చేశారు.  సాగర్ చదువులో చురుగ్గా ఉండేవాడు. ఐదేళ్లుగా ఖమ్మంలోనే ఉంటున్నాడు.  ఓ ప్రైవేట్ కాలేజీలో 2019లో డిగ్రీ పూర్తి చేశాడు.  స్నేహితులతో కలిసి గది అద్దెకి తీసుకుని ఉంటున్నాడు. మూడు నెలల క్రితం వారు వెళ్లిపోవడంతో.. ఒక్కడే కాలం గడుపుతున్నాడు.  జేబు ఖర్చులకు డబ్బు పంపే స్థోమత తల్లిదండ్రులకు లేదని..  వారికి భారం కాకూడదని  ఖాళీ సమయంలో  క్యాటరింగ్ పనులకు వెళ్లేవాడు.  
సంక్రాంతి పండుగకు ఇంటికి వెళ్లి తిరిగి ఖమ్మం వచ్చాడు.  తల్లిదండ్రులు పెళ్లి ప్రస్తావన ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన తర్వాత చేసుకుంటానని చెప్పాడు. సోమవారం రాత్రి తల్లితో ఫోన్లో మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నాడు. తెల్లవారుజామున  బలవన్మరణానికి  పాల్పడ్డాడు.

మార్చురీ వద్ద  తీవ్ర ఉద్రిక్తత..
ఉద్యోగ నోటిఫికేషన్లు లేకనే సాగర్ బలవన్మరణానికి పాల్పడ్డాడని కాంగ్రెస్, బిజెపి, న్యూ డెమోక్రసీ, సిపిఐ, సిపిఎం, బీఎస్పీ నాయకులతోపాటు, పిడిఎస్ యు, ఎస్ఎఫ్ఐ, ఏఐఏఎస్ఎఫ్,  బీజేవైఎం వారు ఆందోళన చేశారు. వారి ఆందోళనతో ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని నినాదాలు చేశారు.  బాధిత కుటుంబానికి రూ. 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. వామపక్ష విద్యార్థి నాయకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేయగా.. బీజేపీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. పోలీసులు ఇరువర్గాలను శాంతింపచేశారు.

స్వగ్రామంలో విపక్షాల ఆందోళన.. 
టిఆర్ఎస్ ప్రభుత్వ వైఖరి కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడని అతని స్వగ్రామం బయ్యారంలో మండలంలోని విపక్ష పార్టీలన్నీ ఆందోళనకు దిగాయి. కుల సంఘాల నాయకులు, నిరుద్యోగులు  మృతదేహాన్ని తరలిస్తున్న వాహనం వెంట వచ్చి రామాలయం సెంటర్లో ఆందోళన చేపట్టారు. ఇల్లందు, మహబూబాబాద్ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కలెక్టర్ సూచనతో మహబూబాబాద్ డిఎస్పీ సదయ్య,  తహసీల్దార్ రంజిత్ బాధిత కుటుంబానికి తక్షణ సాయంగా రూ. రెండు లక్షలు ఇస్తామని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు. 

Follow Us:
Download App:
  • android
  • ios