Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ : కూకట్‌పల్లిలో కుప్పకూలిన నిర్మాణంలో వున్న భవనం.. శిథిలాల కింద పలువురు..?

హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో నిర్మాణంలో వున్న భవనం కుప్పకూలింది. శనివారం మూడో అంతస్తులో స్లాబ్ వేస్తుండగా ఫ్లోర్ ఒక్కసారిగా కూలింది

Under Construction Building Collapses In hyderabad
Author
First Published Jan 7, 2023, 4:00 PM IST

హైదరాబాద్‌లో నిర్మాణంలో వున్న భవనం కుప్పకూలింది. నగరంలోని కూకట్‌పల్లిలో ఈ ఘటన జరిగింది. శనివారం మూడో అంతస్తులో స్లాబ్ వేస్తుండగా ఫ్లోర్ ఒక్కసారిగా కూలింది. దీంతో వెంటనే స్పందించిన స్థానికులు శిథిలాల కింద ఎవరైనా వున్నారేమోనన్న అనుమానంతో సహాయక చర్యలు ప్రారంభించారు.సమాచారం అందుకున్న పోలీస్, రెవెన్యూ అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో ఒక కార్మికుడు మరణించినట్లుగా తెలుస్తోంది. కార్మికులు పనులు చేస్తుండగా 4,5వ ఫ్లోర్ల స్లాబ్‌లు కూలడంతోనే ఈ ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios