హైద్రాబాద్‌లో హవాలా కలకలం: రూ. 10 లక్షల నగదు సీజ్ , పోలీసుల అదుపులో ఇద్దరు
హైద్రాబాద్ పంజాగుట్టలో రూ. 10 లక్షల నగదును పోలీసులు సీజ్ చేశారు. హవాలా రూపంలో ఈ నగదును తరలిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.ఈ నగదుకు ఎలాంటి పత్రాలు లేవని పోలీసులు గుర్తించారు.
హైదరబాద్: నగరంలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం నాడు రూ. 20 లక్షలను పోలీసులు సీజ్ చేశారు. ఈ నగదుకు సంబంధించి ఎలాంటి ధృవపత్రాలు లేని కారణంగా ఈ నగదును పోలీసులు సీజ్ చేశారు. వెంకటేశ్వర్లు, మహేశ్వర్ రెడ్డిలను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.హవాలా మార్గంలో ఈ నగదును తరలిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల కాలంలో హైద్రాబాద్ నగరంలో భారీగా హవాలా రూపంలో నగదును తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మునుగోడు ఉప ఎన్నికలను పురస్కరించుకొని హవాలా రూపంలో నగదును తరలిస్తున్నారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ నెల 11న హైద్రాబాద్ బంజారాహిల్స్ లో రూ. 2 కోట్ల విలువైన హవాలా నగదును పోలీసులు సీజ్ చేశారు. నాలుగు రోజుల వ్యవధిలో హైద్రాబాద్ లో రూ. 10 కోట్ల నగదును పోలీసులు సీజ్ చేశారు. నగరానికి చెందిన వ్యాపారికి చెందిన నగదుగా పోలీసులు గుర్తించారు.ఈ నెల 12న కూడా పెట్టుబడుల పేరుతో హవాలా రాకెట్ ను నడిపిన 10 మంది సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. తైవాన్ కు చెందిన చున్యూ, చైనాకు చెందిన జాక్ ఈ ముఠాలో కీలక పాత్రధారులని హైద్రాబాద్ సీపీ సీవీఆనంద్ చెప్పారు. ఈ కేసులో పుణెకు చెందిన వీరేందర్ సింగ్ ను అరెస్ట్ చేస్తే చైనాకి చెందిన జాక్ హస్తం బయటపడిందని ఆనంద్ తెలిపారు.
ఈ నెల 10న హైద్రాబాద్ గాంధీ నగర్ లో భారీగా నగదును సీజ్ చేశారు. రూ. 3.5 కోట్ల నగదును పోలీసులు సీజ్ చేశారు.. వాహనాలను తనిఖీలు చేసే సమయంలో కారులో నగదును తరలిస్తుండగా పోలీసులు ఈ నగదును సీజ్ చేశారు.
ఈ నెల 9వ తేదీన హైద్రాబాద్ జూబ్లీహిల్స్ లో రూ. 2.5 కోట్ల విలువైన నగదును పోలీసులు సీజ్ చేశారు. హవాలా రూపంలో నగదు తరలిస్తున్న సమయంలో పోలీసులు ఈ నగదును సీజ్ చేశారు. ఈ ఘటనలో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 8వ తేదీన పాతబస్తీలో రూ.79 లక్షలను పోలీసులు సీజ్ చేశారు. ఈ నెల 7న జూబ్లీహిల్స్ లో రూ. 50లక్షలను హవాలా రూపంలో తరలిస్తున్న సమయంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వచ్చే నెల 3వ తేదీన మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి నగదును తరలిస్తున్నారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేయనున్నారు.
also read:హైద్రాబాద్ లో హవాలా కలకలం: హైద్రాబాద్ బంజారాహిల్స్ లో రూ. 2 కోట్ల విలువైన నగదు సీజ్
2020 సెప్టెంబర్ 15న రూ. 3.75 కోట్ల నగదును పోలీసులు సీజ్ చేశారు. ఈ నగదును తరలిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. హవాలా రూపంలో ఈ నగదును తరలిస్తున్న సమయంలో పోలీసులు సీజ్ చేశారు. 2020 అక్టోబర్ 31న హైద్రాబాద్ టాస్క్ పోర్స్ పోలీసులు రూ. 30 లక్షల నగదును సీజ్ చేశారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు.