Suicide in Saudi: బతుకుదెరువు కోసం ఎడారి దేశం సౌదీకి వలస వెళ్లాడు తెలంగాణ చెందిన జగిత్యాల వాసి శ్రీనివాస్. కానీ, తీరా అక్కడికెళ్లాక పరిస్థితులన్నీ తలకిందులు కావడం. ఆ దేశంలో తప్పుడు కేసులో ఇరుకోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృత దేహం తరలింపునకు సహాయం చేయాలని ప్రభుత్వాన్నికోరుతున్నారు బాధిత కుటుంబ సభ్యులు.
Suicide in Saudi: ఉన్న ఊళ్లో ఉపాధి లేక బతుకుదెరువు కోసం ఎడారి దేశం గల్ఫ్ బాట పడుతుంటారు. ఎన్నో ఆశలతో ఆ దేశంలో అడుగుపెట్టిన తరువాత.. అక్కడ పరిస్థితులన్నీ తలకిందులవుతుండడంతో చేసేదేం లేక అష్టకష్టాలు అనుభవిస్తున్నారు. ఇలా తిరిగి ఇంటికి రాలేక తీవ్ర మనస్థాపానికి గురై దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటననే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జగిత్యాల వాసి సౌదీ అరేబియాలో ఆత్మహత్య చేసుకున్నాడు. తన యాజమాని పెట్టిన కేసులో చిక్కుకుని .. ఆ కేసునుంచి బయట పడలేక.. నానా ఇబ్బందులకు గురయ్యాడు. ఈ క్రమంలో తీవ్ర మనస్థాపానికి గురై.. దారుణానికి పాల్పడినట్టు తెలుస్తోంది.
వివరాల్లోకెళ్తే.. తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా.. కోరుట్ల మండలానికి చెందిన శ్రీనివాస్.. తన ఆర్థిక పరిస్థితి బాగాలేక .. నానా ఇబ్బందులు పడి.. బతుకుదెరువు కోసం.. పొట్ట చేతపట్టుకుని సుమారు రెండేండ్ల క్రితం ఉపాధి నిమిత్తం సౌదీ వెళ్లాడు. అతడు అనుకున్నది. ఓ ఉద్యోగమైతే.. తీరా అక్కడికి వెళ్లి చూస్తే... పరిస్థితి మరోలా ఉంది. చేసేది ఏం లేక.. అక్కడ డ్రైవర్‌గా విధుల్లో చేరాడు. అయితే.. అక్కడ వాతావరణం.. పరిస్థితులు పడగా .. గత కొద్ది రోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యాడు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేయించుకున్నాడు.
కాగా.. శస్త్ర చికిత్స నుంచి పూర్తి స్థాయిలో కోలుకోకముందే.. పనిలోకి రావాలని శ్రీనివాస్ యజమాని తీవ్రంగా ఒత్తిడి చేశాడు. దీంతో యజమాని టార్చర్ భరించలేక.. ఆయన పని చేస్తున్న కంపెనీ నుంచి పారిపోయాడు. దీంతో సదరు యజమాని ఆగ్రహించి.. శ్రీనివాస్‌పై కేసు పెట్టాడు. దీంతో అతని పరిస్థితి దారుణంగా మారింది. ఆరోగ్య పరిస్థితి బాగాలేకున్న ఉద్యోగం చేస్తామంటే.. ఉద్యోగం దొరకలేని పరిస్థితి. స్వదేశానికి వస్తామంటే.. రాలేని పరిస్థితి.. అక్కడ ఉంటే.. పోలీసులు పట్టుకుని ఏ విధంగా ఇబ్బందులకు గురి చేస్తారన్న ఆందోళన.. కేసు నుంచి బయటపడతాననే నమ్మకం పూర్తిగా కోల్పోయాడు. తీవ్ర మనస్థాపానికి గురైన శ్రీనివాస్.. తన భార్య లక్ష్మికి వీడియో కాల్ చేసి సోమవారం సాయంత్రం తాను ఉంటున్న గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు. షాక్‌కు గురైన భార్య వెంటనే సౌదీలోని కొంతమంది బంధువులకు సమాచారం అందించగా, వారు గదికి వెళ్లి శవమై కనిపించారు. కాగా.. సౌదీలోని ఇండియన్ కమ్యూనిటీ వలంటీర్లు.. శ్రీనివాస్ మృతదేహాన్ని స్వదేశానికి తరలించడం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇలా ఎంతో మంది.. బతుకు దెరువు కోసం ఎడారి దేశాలకు వలస వెళ్తున్నారు. గల్ఫ్ దేశాలకు వలస పోయేవారిలో ఎక్కువ మంది నైపుణ్యం లేని కార్మికులు, లేదా పాక్షిక నైపుణ్యం ఉన్నవారే. భవన నిర్మాణ రంగంలో సహాయకులుగా, పెయింటర్లుగా, వెల్డర్లుగా, ప్లంబర్లుగా, నిర్మాణ కూలీలుగా, డ్రైవర్లుగా వెళ్తున్నారు. మగవారు టెక్నీషియన్లుగా, మహిళలు ఇంటిపనివారిగా వెళ్తున్నారు. వీరే కాకుండా, ఎక్కువ నైపుణ్యం ఉండి గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న వారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు.
కానీ, అక్కడ పరిస్థితులు భిన్నంగా ఉండటంతో చేసేదేం లేక అష్టకష్టాలను అనుభవిస్తున్నారు. తమను ఆదుకోవాలని వీడియోల రూపంలో వేడుకుంటున్నారు. కానీ.. ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నాయి గల్ఫ్ బాధితుల సంఘాలు. ఇప్పటివరకు 2,850 మంది గల్ఫ్ కార్మికులు చనిపోతే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని వివరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో లక్షో, 2 లక్షలో వచ్చేవన్న ఆయన.. తెలంగాణ వచ్చాకే వలసలు భారీగా పెరిగాయని తెలిపారు. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకరం 18.5 వలసలు ఎక్కువయ్యాయని చెప్పారు.
