సిద్ధిపేట జిల్లాలో కేఎ పాల్ మీద డీఎస్పీ సమక్షంలోనే దాడి


సిద్దిపేట జిల్లాలోని జక్కాపూర్ లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పై సోమవారం నాడు దాడి జరిగింది. రైతులను పరామర్శించేందుకు కేఏ పాల్ వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది.
 

Un known Person Attacked On Praja Shanti party President KA Paul

సిద్దిపేట:  Siddipet జిల్లాలోని Jakkapur లో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA Paul పై సోమవారం నాడు దాడికి ప్రయత్నించారు. రైతులను పరామర్శించేందుకు కేఏ పాల్ వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.ఈ విషయమై తమకు సమాచారం రావడంతో రైతులను పరామర్శించేందుక వెళ్లాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా కేఏ పాల్ చెప్పారు. అయితే కేఏ పాల్ పర్యటన విషయం తెలుసుకొన్న టీఆర్ఎస్ నేతలు నిరసనకు దిగారు. రాజన్న సిరిసిల్లకు వెళ్లే మార్గంలో కేఏ పాల్ ను అడ్డుకొనేందుకు టీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నించాయి. అయితే ఈ విషయమై కేఏ పాల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే రాజన్న సిరిసిల్లకు వెళ్లకుండా TRS  శ్రేణులు అడ్డుకోవడంతో పోలీసులతో ఈ విషయమై కేఏ పాల్ మాట్లాడుతున్నాడు. సిద్దిపేట జిల్లాలోని చిన్నకోడూరు మండలం జక్కాపూర్ వద్ద ఈ విషయమై కేఏ పాల్ మాట్లాడుతున్నాడు. అదే సమయంలో  జిల్లెల్ల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కేఏ పాల్ పై దాడికి దిగారు.ఈ విషయమై కేఏ పాల్  అనుచరులు, టీఆర్ఎస్ శ్రేణులకు మధ్య ఘర్షణ  తోపులాట చోటు చేసుకొంది.

ఈ దాడి జరిగిన తర్వాత వెంటనే పోలీసులు కేఏ పాల్ ను కారులో కూర్చోబెట్టి అక్కడి నుండి పంపించి వేశారు. ఎనిమిదేళ్ల టీఆర్ఎస్ పాలనలో ఇప్పటివరకు ఇచ్చిన హామీలను కేసీఆర్ సర్కార్ అమలు చేయలేదని పాల్ విమర్శలు చేశారు. తనపై  దాడి వెనుక కేసీఆర్, కేటీఆర్ లు ఉన్నారని ఆయన ఆరోపించారు. తనను చంపించేందుకు కేటీఆర్, కసీఆర్ లు ప్రయత్నిస్తున్నారని కూడా ఆయన ఓ టీవీ  చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆరోపించారు. కేసీఆర్ సర్కార్ బండారం బయటపెడుతున్నందుకే తనపై దాడి చేశారన్నారు.

గతంలో తాను కేసీఆర్ కు తాను సపోర్ట్  చేశానని కేఏ పాల్ చెప్పారు. తాను  మద్దతిచ్చినందుకే కేసీఆర్ విజయం సాధించారన్నారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో తన కార్యక్రమాలకు కేసీఆర్ సర్కార్ అనుమతి ఇవ్వడం లేదన్నారు.   ఇదిలా ఉంటే కేఏ పాల్ పై దాడి చేసిన కార్యకర్తను అనిల్ గా పోలీసులు గుర్తించారు. డీఎస్పీ సమక్షంలోనే తనపై టీఆర్ఎస్ కార్యకర్త దాడి చేశారని కేఏ పాల్ చెప్పారు.  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios