ఉక్రెయిన్ లో చిక్కుకొన్న భారతీయ విద్యార్ధులను స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రికి లేఖ రాశారు.

హైదరాబాద్: Ukraine లో చిక్కుకొన్న 20 మంది భారతీయ విద్యార్ధులను స్వదేశానికి రప్పించేందుకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్ర వివేశాంగ మంత్రికి BJP తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ Bandi Sanjay కోరారు.

స్వదేశానికి వచ్చేందుకు కీవ్ విమానాశ్రయానికి సుమారు 20 మంది విద్యార్ధులు వచ్చారు. అయితే ఉక్రెయిన్ తన గగనతలాన్ని మూసివేసింది. దీంతో ఉక్రెయిన్ నుండి భారతీయులను తీసుకొచ్చేందుకు వెళ్లిన flight ఖాళీగా తిరిగి వచ్చేసింది. ఈ విషయాన్ని బాధిత కుటుంబ సభ్యులు బండి సంజయ్ దృష్టికి తీసుకొచ్చారు. ఉక్రెయిన్ లో చిక్కుకొన్న విద్యార్ధులను స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ కేంద్ర Foreign ministerకి గురువారం నాడు లేఖ రాశారు. 

యూనివర్శిటీకి వెళ్లలేక ఇండియాకు తిరిగి రాలేక విమానాశ్రయంలోనే విద్యార్ధులు చిక్కుకొన్నారు. కీవ్ ఎయిర్ పోర్టును రష్యా ఎయిర్ పోర్టు తమ ఆధీనంలోకి తీసుకొంది.తెలంగాణ విద్యార్ధులతో పాటు ఇండియాకు చెందిన విద్యార్ధులను కూడా స్వదేశానికి రప్పించాలని ఆయన ఆ లేఖలో కోరారు.

ఇండియాకు చెందిన సుమారు 20 వేల మంది ఉక్రెయిన్ లో నివాసం ఉంటున్నారు. రష్యా మిలటరీ చర్యను ప్రారంభించిన తర్వాత ఉక్రెయిన్ తన గగనతలాన్ని ఇవాళ మూసివేసింది. ఉక్రెయిన్ అభ్యర్ధన మేరకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తోంది. 

ఉక్రెయిన్ పై రష్యా దాడిని అన్యాయమైన దాడిగా అమెరికా అధ్యక్షుడు Joe Biden అభిప్రాయపడ్డారుఉక్రెయిన్ మిలటరీ ఆపరేషన్ కు రష్యా బాధ్యత వహించాల్సి ఉంటుందని అమెరికా తేల్చి చెప్పింది. రష్యా దాడికి ప్రతి చర్య తప్పదని జో బైడెన్ హెచ్చరించారు. ఉక్రెయిన్ కు నాటో దళాలు ఉక్రెయిన్ కు మద్దతుగా నిలుస్తున్నాయి.

ఉక్రెయిన్ పై తమ మిలటరీ చర్య విషయంలో ఇతరుల జోక్యాన్ని తాము సహించబోమని రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు. జోక్యం చేసుకొన్న దేశాలు కూడా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని పుతిన్ హెచ్చరించారు.

దీంతో ఉక్రయిన్ లో అత్యవసర పరిస్థతిని విధించారు. తమ ఎయిర్ స్పేస్ ను ఉక్రెయిన్ మూసివేసింది. ఉక్రెయిన్ లో ఖార్కిస్, ఒడెస్సా, పోల్ లో మిస్సైల్స్ తో దాడులు చోటు చేసుకొన్నాయి. డోస్‌బాస్ లో ఉక్రెయిన్ బలగాలను వెనక్కి వెళ్లిపోవాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు. 

ఇదిలా ఉంటే ఉద్రిక్తతలు పెరగకుండా చూడాలని చైనా ప్రకటించింది. ఇరు వర్గాలు సంయమనం పాటించాలని చైనా కోరింది.ఉక్రెయిన్ పై రష్యా దాడి నేపథ్యంలో గురువారం నాడు దేశ ప్రజలనుద్దేశించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రసంగించనున్నారు. ఈ దాడితో భారీ ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం సంభవించే అవకాశం ఉందని అమెరికా అభిప్రాయపడింది.

తూర్పు ఉక్రెయిన్ లో తిరుగుబాటు నాయకులు కైవ్ పై సైనిక సహాయం కోసం మాస్కోను కోరినట్టుగా క్రెమ్లిన్ ప్రకటించిన తర్వాత మిలటరీ ఆపరేషన్ ప్రారంభమైందని పుతిన్ ప్రకటించారు. బుధవారం నాడు డోనెట్స్ , లుగాన్స్ వేర్పాటువాద నాయకులు పుతిన్ కు వేర్వేరుగా లేఖలు పంపారు. ఉక్రెయిన్ దూకుడును తిప్పికొట్టడానికి సహాయం చేయాలని కోరారు. ఈ విషయాన్ని పుతిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ తెలిపారు.