వృద్ధులపై ఇద్దరు మహిళలు దాడికి తెగబడ్డారు. తమ వద్ద ఉన్న కత్తులు చూపించి బెదిరించి.. వృద్ధుల వద్ద ఉన్న బంగారం, నగదు అపహరించారు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

చాదర్‌ఘాట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఉస్మాన్‌పురాలో ఇద్దరు మహిళలు బురఖాలో వచ్చి వృద్ధురాలి (85)ని గొంతుపై కత్తి పెట్టి బెదిరించారు. నగదు, నగలు కావాలని బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో ఆమె ప్రాణభయంతో గజగజ వణికింది. అనంతరం ఆ యువతులు బెదిరించి ఆమె నుంచి రూ.6 లక్షల నగదుతో పాటు ఒంటిపై ఉన్న బంగారు నగలు దోచుకుని పరారయ్యారు. 

స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులు పరిశీలించారు. అయితే ఆ సమయంలో ఆమె భర్త ఇంట్లోనే ఉన్నారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే అహ్మద్ బలాల వృద్ధ దంపతులను పరామర్శించారు. వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.