హైదరాబాద్ పాతబస్తీలో విషాదం చోటు చేసుకుంది. హుస్సేనీ ఆలంలోని పాత రేకుల ఇల్లు కూలి ఇద్దరు మహిళలు మరణించగా, ఐదుగురికి గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అనీస్ బేగం, ఫరా బేగం అనే ఇద్దరు యువతులు మరణించారు.

గాయపడిన మహమ్మద్ ఖాన్, పర్వీన్ బేగం, అంజాద్ ఖాన్, హసంఖాన్, హుస్సేన్ ఖాన్ ఆసుపత్రిలో చిక్కుకున్నారు. నగరంలో కురిసిన భారీ వర్షానికే ఇల్లు కూలినట్లు అధికారులు వెల్లడించారు.