హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మరణించారు. రంగారెడ్డి జిల్లాలోని ఆదిబట్ల పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం ప్రమాదం చోటు చేసుకుంది. 

సాగర్ హైవేపై రాగన్నగుడా గేట్ వద్ద స్కూటీని టిప్పర్ ఢీకొట్టింది. దీంతో స్కూటీపై వెళ్తున్న ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మరణించారు. మృతి చెందిన ఇద్దరు మహిళలు అత్తాకోడళ్లు. 

అత్త రమ (56), కోడలు హిమజ (24) కొత్తపేటలో నివాసం ఉంటున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ కోసం మన్నెగుడా ఆర్టీఏ ఆఫీసుకు వెళ్తుండగా వారిని టిప్పర్ రూపంలో మృత్యువు కాటేసింది.

రమ ఆంధ్రబ్యాంక్ లో ఉద్యోగం చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్ారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.