హైదరాబాద్: హైద్రాబాద్ నగర శివారల్లోని ఐడీఏ బొల్లారంలో ఓ ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.రోడ్డుపైనే ఆటోను  ఆపిన ఆటో డ్రైవర్  నిర్లక్ష్యంగా డోరు తెరవడంతో ఈ ఘటన చోటు చేసుకొంది.

ఐడీఏ బొల్లారంలో రోడ్డుపైనే ఓ డ్రైవర్ తన ఆటోను ఆపాడు.అదే సమయంలో  ఎంఎస్ రెడ్డి, కనక మహాలక్ష్మిలు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. వెనకనుండి ఎవరు వస్తున్నారో చూసుకోకుండా ఆటో డ్రైవర్ డోర్‌ తీశాడు.  దీంతో  ద్విచక్ర వాహనంపై వస్తున్న ఎంఎస్ రెడ్డి, కనకమహలక్ష్మి ద్విచక్ర వాహనంపై నుండి కింద పడిపోయారు.

వెనుక నుండి వచ్చిన టిప్పర్  వారిపై నుండి వెళ్లింది. దీంతో ఎంఎస్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. కనక మహాలక్ష్మి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.  వీరు బొల్లారంలోని జ్యోతినగర్‌లో ఉంటున్నారు. 

కనక మహాలక్ష్మి అరబిందో ఫార్మసీలో పనిచేస్తోంది. ఆమెను కార్యాలయం వద్ద దింపేందుకు ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఆ ప్రమాదం చోటు చేసుకొంది.ఈ దుర్ఘటనకు కారణమైన ఆటో డ్రైవర్ అక్కడి నుండి పారిపోయాడు. ఈ ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాల్లో  రికార్డయ్యాయి.