విషాదం : బోగత జలపాతం పడి ఇద్దరు మృతి

First Published 17, May 2018, 9:14 PM IST
two persons died in bogatha water fall
Highlights

బాధాకరం

వరంగల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గురువారం హన్మకొండ భవానీ నగర్ కి చెందిన ఇసరపు సతీష్ (3) రాపోలు హర్షిత్ రెడ్డి(11) జయశంకర్ భూపాలపల్లి జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి బోగత జలపాతంలో పడిపోయి మృతిచెందారు.

వీరు కుటుంబ సభ్యుల తో కలిసి బోగత జలపాతానికి వచ్చారు. ఆ సమయంలో వీరు స్నానం చెయ్యటానికి బండ లపైకి వెళ్ళటం తో ప్రమాదవశాత్తు కాలు జారీ లోయలో పడిపోయారు. దీంతో ఇద్దరూ చనిపోయారు.

హర్షిత్ రెడ్డి 6 వ తరగతి చదువుతున్నాడు. సతీష్ హర్షిత్ రెడ్డి వాళ్ళ బోటిక్ షాప్ వర్కర్ గా చేస్తున్నాడు. ఈ సంఘటన తో బోగత జలపాతం శోక సముద్రంలో మునిగిపోయింది.

loader