పార్కులో యువతులతో అసభ్యంగా ప్రవర్తించినందుకు ఇద్దరు ఆకతాయిలకు న్యాయస్థానం ఐదు రోజుల జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే.. సాయి ప్రశాంత్, బాజీబాబు అనే యువకులు హైదరాబాద్ సంజీవయ్య పార్కులో కొందరు యువతులతో అసభ్యంగా ప్రవర్తించారు.

దీనిపై అమ్మాయిలు షీటీమ్స్‌కు సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన పోలీసు సిబ్బంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరిని కోర్టులో హాజరుపరచగా.. మేజిస్ట్రేట్ వీరికి 5 రోజుల జైలు శిక్షతో పాటు రూ.250 జరిమానా విధించారు. మరోవైపు మహిళా డాక్టర్‌కు ఫోన్ చేసి అసభ్యపదజాలంతో వేధించడంతో.. వికారాబాద్ జిల్లా మోమిన్‌పేటకు చెందిన రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.