హైదరాబాద్: హైద్రాబాద్‌ సైఫాబాద్ లో బుధవారం నాడు పోలీసులు రూ. 7 కోట్ల నగదును స్వాధీనం చేసుకొన్నారు. ఈ నగదును తరలిస్తున్న  ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

సైఫాబాద్ లో బుధవారం నాడు వాహనాల తనిఖీ సందర్భంగా పోలీసులు రూ. 7 కోట్లను స్వాధీనం చేసుకొన్నారు. మహారాష్ట్ర, ఢిల్లీ నుండి ఈ నగదును తరలించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.ఈ నగదు తరలింపు వెనుక హవాలా రాకెట్ ఉన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. 

అర్ధరాత్రి 3 గంటల సమయంలో అపార్ట్ మెంట్ లో చుట్టుముట్టిన పోలీసులు, ఐటీ అధికారులు హైద్రాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో తనిఖీలు నిర్వహించారు.వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్, సెంట్రల్ జోన్ పోలీసులు జాయింట్ ఆపరేషన్‌లో పోలీసులు సుమారు 7.7 కోట్ల నగదును స్వాధీనం చేసుకొన్నారు.

ఈ నగదుకు సరైన లెక్కలు చూపలేదని పోలీసులు చెబుతున్నారు.నగదుకు సంబంధించి ఆధారాలు చూపలేకపోయారని పోలీసులు చెబుతున్నారు. ఇంపోర్ట్ అండ్ ఎక్స్‌పోర్ట్ వ్యాపారం చేస్తున్నామని ఇద్దరు వ్యక్తులు పోలీసులకు చెప్పినట్టు సమాచారం.

సైఫాబాద్‌లో తనిఖీలు చేస్తున్న సమయంలో అనుమానితులను ప్రశ్నించగా ఈ విషయం వెలుగు చూసినట్టు పోలీసులు చెబుతున్నారు.ఈ ఘటనలో తండ్రీ కొడుకులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

అయితే అరెస్టైన వారు ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ వ్యాపారం నిర్వహిస్తున్నట్టు పోలీసులకు వివరణ ఇచ్చారు.  కంపెనీకి సంబంధించిన వివరాలు సరిగా లేవని కూడ పోలీసులు అనుమానిస్తున్నారు. లగ్జరీ కార్లలో తిరుగుతూ డబ్బులను సరఫరా చేస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయమై విచారణ చేస్తున్నట్టు పోలీసులు ప్రకటించారు.