రోజురోజుకూ బాలికల మీద అత్యచారాలు పెరిగిపోతున్నాయి. వావి వరసలు మరిచి కూతురు వరసయ్యే చిన్నారులపై తమ ప్రకోపం చూపిస్తున్నారు. 12,13 యేళ్ల ఇద్దరు చిన్నారులపై హైదరాబాద్ లో వేర్వేరు చోట్ల జరిగిన అత్యాచారాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. 

కూతురు వరసయ్యే బాలికపై అత్యాచారం చేశాడో కామాంధుడు. జగద్గిరిగుట్టలో నివాసం ఉండే దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు. రెండో కుమార్తె (13) సమీపంలోనే ఉండే పెదనాన్న రాములు ఇంటికి అప్పుడప్పుడు టీవీ చూడడానికి వెళ్తుంది.

ఆమె మీద కన్నేసిన రాములు ఇంట్లో బంధించి నోట్లో గుడ్డలు కుక్కి, అత్యాచారం చేశాడు. అలా ఆమెను బెదిరించి మూడుసార్లు అత్యాచారం చేశాడు. ఇటీవల బాలిక గర్భం దాల్చడంతో ఈ నెల 25న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

ఇలాంటిదే మరో ఘటన సైదాబాద్ లో జరిగింది. అభం, శుభం తెలియని చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడో కామాంధుడు. రంగారెడ్డి జిల్లాకు చెందిన గిరిజన మహిళ నలుగురు కూతుళ్లతో కలిసి సైదాబాద్ లో ఉంటుంది. 6వ తరగతి చదువుతున్న ఆమో రెండో కూతురు (12) శనివారం దగ్గర్లోని కిరాణా షాపుకు వెళ్లింది. 

అదే ప్రాంతంలో బెల్ట్ షాప్ నడుపుతున్న జనార్థన్ (54) పని ఉందంటూ బాలికను తన ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం ఎవరికీ చెప్పొంద్దని బెదిరించాడు. ఆదివారం బాలిక తీవ్ర అవ్వస్థతకు గురికావడంతో తల్లి ఆరాతీయగా.. బాలిక జరిగిన దారుణాన్ని చెప్పింది. దీంతో ఆమె గిరిజన సంఘం నేతలతో కలిసి సైదాబాద్ పీఎస్ లో ఫిర్యాదు చేసింది.