తెలంగాణలో మావోయిస్టులకు మరో దెబ్బ తగిలింది. ములుగు జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోలు హతమయ్యారు.

నర్సింహసాగర్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తోన్న స్పెషల్ పార్టీ పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.  

ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మృతులను ఇటీవల టీఆర్‌ఎస్‌ నేత భీమేశ్వరావును హతమార్చిన మావోయిస్టులుగా గుర్తించారు.

కాగా, ఈ నెల 10న అర్ధరాత్రి సమయంలో మావోయిస్టులు ములుగు జిల్లా వెంకటాపురంలో టీఆర్ఎస్ నేత భీమేశ్వర రావుని అర్ధ రాత్రి బయటకు లాక్కొచ్చి చంపిన విషయం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇన్‌ఫార్మరనే నెపంతో మావోయిస్టులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు