రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన సంఘటన  బీబీనగర్‌లో చోటుచేసుకుంది.ముందు వెళ్తున్న లారీని డీసీఎం వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. డీసీఎం డ్రైవర్ రాజు, క్లీనర్ హరీష్ ప్రాణాలు కోల్పోయారు. మృతులిద్దరూ వరంగల్ జిల్లా నెక్కొండ మండలం వెంకటాపూర్‌కు చెందినవారిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.