జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్ బోల్తా పడటంతో దానికింద నలిగి ఇద్దరు దుర్మరణం చెందారు. 

జగిత్యాల: ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. మరో ఇద్దరు స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. ఈ దుర్ఘటన జగిత్యాల జిల్లా (jagitial district)లో చోటుచేసుకుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామ శివారులో జాతీయ రహదారిపై వెళుతున్న ట్రాక్టర్ అదుపుతప్పి ప్రమాదాని (accident)కి గురయ్యింది. ఎదురుగా వచ్చిన ఓ వాహనాన్ని తప్పించేక్రమంలో ట్రాక్టర్ అదపుతప్పి పల్టీ కొట్టింది. దీంతో డ్రైవర్ తో పాటు మరొకరు ట్రాక్టర్ కిందపడి నలిగి అక్కడికక్కడే మృతిచెందారు. 

Video

ప్రమాదంలో (tractor accident) మృతిచెందిన ఇద్దరు మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్, సంతోష్ గా గుర్తించారు. ఈ యాక్సిడెంట్ పై సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకున్నారు. క్రేన్ సాయంతో సుమారు గంట పాటు కష్టపడి ట్రాక్టర్ ను పైకిలేపారు. అయితే గానీ మృతదేహాలను బయటకు తీయడం సాధ్యం కాలేదు.

read more Hyderabad Accident: మందుబాబుల బీభత్సం... డివైడర్ పైనుండి గాల్లో పల్టీలు... మరో కారును ఢీకొన్న ఐ20

మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన సూరత్ , ప్రతీప్ లను కూడా హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.