సంతోషంగా పెళ్లికి వెళ్లి వస్తున్న వారి కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుంది. అతివేగం వారి ప్రాణాల్ని తీసింది. కారు టైర్లు పేలడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా యాచారంలో చోటు చేసుకుంది.
రంగారెడ్డి : telangana, రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గున్ గల్ సమీపంలో సాగర్ రహదారిపై road accident చోటు చేసుకుంది. వివాహానికి హాజరై ఇంటికి తిరిగి వస్తుండగా... car అదుపు తప్పడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు death అవ్వగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
మృతులు వట్టినాగులపల్లికి చెందిన తలపల్లి రామకృష్ణ, మాటూరి శ్రీకాంత్ లుగా గుర్తించారు. కారు అతి వేగంతో ఉండడంతో.. వాహనం tyres పేలి పోవడంతో.. ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. postmortem నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ లింగంపల్లి నుంచి యాచారం మండలం మాల్ లో జరిగిన వివాహానికి హాజరై వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఇదిలా ఉండగా, జనవరి 5న andhrapradesh రాష్ట్రంలోని guntur జిల్లాలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. road accidentలో ముగ్గురు students మరణించారు. liquor సేవించి బైక్ మీద ప్రయాణిస్తున్న ముగ్గురు విద్యార్థులు ప్రమాదంలో మృత్యవాత పడ్డారు. బైక్ విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ముగ్గురు విద్యార్థుల్లో ఒకరు అక్కడికక్కడే మరణించగా, మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించారు.
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెం వద్ద ఆ ప్రమాదం జరిగింది. మృతులను పెనుమాకవాసులుగా గుర్తించారు. జన్మదిన వేడుకలకు వెళ్లి తిరిగి వస్తుండగా విద్యార్థులు రోడ్డు ప్రమాదానికి బలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, ఆదివారం అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం సాయంత్రం ఉరవకొండ మండలం బుదగవిలో లారీ, కారు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. కర్ణాటకలోని బళ్లారిలోపెళ్లికి హాజరై తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతులను ఉరవకొండ మండలం నిమ్మగల్లు వాసులుగా గుర్తించారు. మృతులంతా ఒకే కుటుంబసభ్యులు, బంధువులుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన మరిన్ని విరాలు తెలియాల్సి ఉంది.
