సంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాధంలో వధూవరులతో సహా 25 మంది తీవ్రంగా గాయపడి హాస్పిటల్ పాలవగా, ఇద్దరు మృతిచెెందారు. 

సంగారెడ్డి : కొత్తజీవితాన్ని ప్రారంభించిన ఆనందం వారికి ఎక్కువకాలం నిలవలేదు. పెళ్ళయిన తర్వాతిరోజే వధూవరులతో సహా పెళ్లి బృందం ప్రయాణిస్తున్న వాహనం రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. దీంతో ఇద్దరు మృతిచెందగా 25 మంది గాయపడ్డారు. నవవధువు కాలు నుజ్జునుజ్జు కావడంతో కాలు తొలగించాల్సి వచ్చింది. ఈ దుర్ఘటన తెలంగాణ రాజధాని హైదరాబాద్ శివారులో చోటుచేసుకుంది. 

మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం చిట్కుల్ కు చెందిన యువతి నాగరాణికి రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిన్న మంగళారంకు చెందిన భూషణ్ తో వివాహం జరిగింది. ఈ నెల 11న వధువు స్వగ్రామంలో ఘనంగా పెళ్లి జరిగింది. తర్వాత రోజు అంటూ 12న వరుడి ఇంట విందు ఏర్పాటు చేసారు. ఇందుకోసం వధువు కుటుంబసభ్యులతో పాటు బంధువులు, గ్రామస్తులు డిసిఎం వాహనంలో చిన్న మంగళారానికి వెళ్ళారు. 

విందులో ఆనందంగా గడిపిన వధువు తరపువారు రాత్రి తిరుగుపయనం అయ్యారు. వధూవరులతో సహా 45మంది డిసిఎంలో వెళుతుండగా ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ శివారులోని పటాన్ చెరు సమీపంలో రుద్రారం వద్ద పెళ్ళి బృందం డిసిఎం ప్రమాదానికి గురయ్యింది. వేగంగా వెళుతున్న డిసిఎం ఓ లారీ బలంగా ఢీకొన్నాయి. దీంతో కిష్టయ్య(15) అనే బాలుడితో సహా రాములమ్మ(54) అనే వృద్దురాలు అక్కడికక్కడే మృతిచెందారు. నూతన వధూవరులు, 25మంది తీవ్రంగా గాయపడ్డారు.

Read More బడాపహడ్ దర్గాకు వెళుతుండగా డిసిఎం బోల్తా... 30మంది భక్తులకు గాయాలు

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ కు తరలించారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా వున్నట్లు సమాచారం. ప్రమాదానికి డ్రైవర్ల నిర్లక్ష్యమే కారణంగా తెలుస్తోంది.