హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని పాతబస్తీలో హుక్కా పార్టీల నిర్వహణ వ్యవహారం వెలుగు చూసింది. పాతబస్తీలో పహడీ షరీఫ్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆ వ్యవహారం బయటపడింది. 

పోలీసు స్టేషన్ ప్రహరీ గోడకు ఆనుకుని ఉన్న ఫామ్ హౌస్ లో హుక్కా పార్టీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. హుక్కా పార్టీల వ్యవహారంలో పోలీసులు ఇద్దరు జూనియర్ ఆర్టిస్టులను, 18 మంది బాడీ బిల్డర్లను అరెస్టు చేశారు. 

ముజ్రా పార్టీల వ్యవహారంలో పోలీసులు హుక్కా సామగ్రిని, మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. బర్త్ డే పార్టీల పేరుతో నదీం అహ్మద్ అనే వ్యక్తి ఈ ముజ్రా పార్టీలను ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.