రాజన్న సిరిసిల్ల జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. భూవివాదం నేపథ్యంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాలకు చెందినవారు విచక్షణరహితంగా దాడులు చేసుకున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. భూవివాదం నేపథ్యంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాలకు చెందినవారు విచక్షణరహితంగా దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. వివరాలు.. భూవివాదం నేపథ్యంలో అంకుషాపూర్, రామన్నపల్లెకు చెందిన ఇరువర్గాల యువకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో రామన్నపల్లెకు చెందిన ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. అందులో రాజు అనే యువకుడి పరిస్థితి విషమంగా ఉంది.
Add Asianetnews Telugu as a Preferred Source

ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
