వనపర్తి జిల్లా ఆత్మకూరులో విషాదం చోటుచేసుకుంది. జూరాల ఎడమకాల్వలో నలుగురు గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరు మృతిచెందారు. 

వనపర్తి జిల్లా ఆత్మకూరులో విషాదం చోటుచేసుకుంది. జూరాల ఎడమకాల్వలో నలుగురు గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరు మృతిచెందారు. వివరాలు.. జెన్‌కో ఉద్యోగి రాజేంద్రప్రసాద్ తన బంధువులతో కలిసి జూరాల ఎడమకాల్వలో సాన్నానికి వెళ్లారు. ఈ క్రమంలోనే ఐదుగురు నీటిలో గల్లంతయ్యారు. అయితే వారిలో ఇద్దరిని స్థానికులు రక్షించారు. అయితే రాజేంద్రప్రసాద్‌తో పాటు, అతని బంధువు శ్రావణ్ నీటిలో గల్లంతై మృతిచెందారు. ఈ ఘటనలో రాజేంద్రప్రసాద్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 

ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు వివరాలు ఆరా తీస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.