హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా షాదనగర్ నియోజకవర్గం తిమ్మాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆయిల్ టాంకర్ లారీని కారు ఢీకొట్టింది.  కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తుల మరణించారు. 

ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. వీరంతా హైదరాబాదులోని సైదాబాద్ కాలనీకి చెందినవారు.  తిరుమల దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కారు ఆయిల్ ట్యాంకర్ కిందికి దూసుకుని వెళ్లింది. వివరాలు తెలియాల్సి ఉంది.