జగిత్యాల జిల్లాలోని మెట్ పల్లిలో విద్యుత్ షాక్ తో ఇద్దరు మృతి చెందారు. ఓ దుకాణం వద్ద బోర్డు  మారుస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.  ఈ ప్రమాదంలో మరో  ఇద్దరు  గాయపడ్డారు. 

మెట్‌పల్లి: జగిత్యాల జిల్లాలోని మెట్ పల్లిలో విద్యుత్ షాక్ తో మంగళవారం నాడు ఇద్దరు మృతి చెందారు . మరో ఇద్దరు గాయపడ్డారు. దుకాణానికి బోర్డు మారుస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు.జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామానికి చెందిన వినీత్, వికాస్ లు మెట్ పల్లిలోని తన స్నేహితుడి బేకరి షాప్ వద్ద బోర్డు మార్చే సమయంలో విద్యుత్ షాక్ కు గురయ్యారు.ఈ ఘటనలో వీరిద్దరూ అక్కడికక్కడే మరణించారు . మరో ఇద్దరు గాయపడ్డారు. గాయపడిన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. మృతుదేహలను జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిద్దరికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విద్యుత్ షాక్ తో పలువురు మృతి చెందిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది ఆగస్టు 31న మంచిర్యాల మండలం కోటపల్లి మండలం బొప్పారంలో విద్యుత్ షాక్ తో ఇద్దరు మరణించారు. పొలంలో భార్య, చిన్నారి విద్యుత్ షాక్ కు గురయ్యారు. ఈ విషయం గమనించిన భర్త వారిని కాపాడే ప్రయత్నంలో విద్యుత్ షాక్ కు గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి ఆమె తల్లి మరణించగా,భర్త మాత్రం ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నారు. ఈ ఏడాది జూలై 12న కామారెడ్డి జిల్లాలో ఒకే కుటుంబంలోని నలుగురు విద్యుత్ షాక్ తో మరణించారు. భార్యభర్తలతో పాటు వారి ఇద్దరు పిల్లలు విద్యుత్ షాక్ తో మరణించారు.