తెలంగాణలోని యాదాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు, ట్రాక్టర్ డీకొన్న ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు. 

తెలంగాణలోని యాదాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు, ట్రాక్టర్ డీకొన్న ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు. ఆలేరు మండలం మంతపురి బైపాస్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా.. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదంలో మృతిచెందిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.