నిజామాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఓ కంటైనర్ వేగంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
నిజామాబాద్ : nizamabad జిల్లాలో ఘోర road accident జరిగింది. బాల్కొండ మండలం కిసాన్ సాగర్ సమీపంలో 44వ నబంరు national highwayపై ఆగిఉన్న లారీని కంటైనర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ బాధితుడిని నిర్మల్ స్థానికులు ఆస్పత్రికి తరలించారు. హైవే మీద రోడ్డు ప్రమాదం కావడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్ ను క్లియర్ చేస్తూ వాహనాలను బాల్కొండ మీదుగా మళ్లిస్తున్నారు.
ఇదిలా ఉండగా, జూన్ 30న ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం పూసలపాడు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక ప్రైవేటు బస్సు లారీ, ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఇరవై మందికి గాయాలయ్యాయి. ప్రమాదానికి సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన బాధితులను దగ్గర్లోని కుంబం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తున్నారు. కాగా, లారీని ఢీకొన్న బస్సు రోడ్డు మీద అడ్డంగా పడిపోవడంతో జాతీయ రహదారి మీద రెండు వైపులా కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో, అధికారులు బస్సును క్రేన్ సహాయంతో తొలగిస్తున్నారు. బస్సు విజయవాడ నుంచి అనంతపురం వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
మద్యం పెట్టిన చిచ్చు.. అన్నంలో పురుగుల మందు కలుపుకుని, తల్లీ ఇద్దరు బిడ్డలు ఆత్మహత్యాయత్నం...
కాగా, జూన్ 27న నిజామాబాద్ జిల్లాలోని వేల్పూరు క్రాస్ రోడ్డు వద్ద ఇలాంటి రోడ్డు ప్రమాదమే జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే సజీవదహనం అయ్యారు. ఆగి ఉన్న ఒక లారీని వెనకనుండి వచ్చిన కారు ఢీ కొట్టింది. ఢీ కొట్టిన ధాటికి వెంటనే కారులో మంటలు చెలరేగాయి. దీంతో, కారులో ఉన్న ఇద్దరు బైటికి రాలేక చిక్కుకుపోయి అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతులిద్దరినీ జగిత్యాల జిల్లా వాసులుగా గుర్తించారు.
మరోవైపు, జూన్ 25న నంద్యాలలో ఇలాంటి రోడ్డు ప్రమాదమే జరిగింది. ఈ ప్రమాదంలో నవవరుడు మృతి చెందాడు. దీంతో నంద్యాల జిల్లా వెలుగోడు మండలం పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పెళ్లైన కొన్ని గంటలకే నవ వరుడు శివకుమార్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటన జూన్ 25, శనివారం తెల్లవారుజామున జరిగింది. ఆ సమయంలో అతను రోడ్డు మీద వెడుతుండగా వెలుగోడు మండలంలోని మోత్కూరు వద్ద గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. దీంతో శివకుమార్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేస్తున్నారు. వివాహం జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే శివకుమార్ చనిపోవడం రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.
