Asianet News TeluguAsianet News Telugu

నాలుగేళ్ల తర్వాత నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్ల ఎత్తివేత

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ‌ రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుండి నాగార్జున సాగర్‌ జలాశయానికి భారీగా నీరు వచ్చి చేరడంతో  ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండింది

two crest gates of nagarjuna sagar lifted
Author
Nagarjuna Sagar Dam, First Published Sep 2, 2018, 12:38 PM IST


నల్గొండ: నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ‌ రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుండి నాగార్జున సాగర్‌ జలాశయానికి భారీగా నీరు వచ్చి చేరడంతో  ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండింది. దీంతో ఆదివారం నాడు ప్రాజెక్టు  రెండు గేట్లు ఎత్తేశారు.

 నాలుగేళ్ల తర్వాత నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తారు. ప్రాజెక్టుకు గత మూడేళ్లుగా ఆశించిన మేర నీరు రాలేదు. ఎగువన సరైన వర్షాలు లేకపోవడంతో పాటు  ఇతరత్రా కారణాలతో  నాగార్జున సాగర్ గత మూడేళ్లుగా నిండలేదు.

ఈ ఏడాది కూడ జిల్లాలో  ఆశించిన మేర వర్షాలు లేవు. కానీ కృష్ణా పరివాహక ప్రాంతంలో ఎగువన కురిసిన వర్షాల కారణంగా  శ్రీశైలం, తుంగభద్రల నుండి భారీగా వరద ప్రవాహం నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులోకి చేరింది. 

ఆదివారం నాడు  సాగర్ ప్రాజెక్టు రెండు గేట్లను  ఐదు అడుగుల మేరకు ఎత్తి  నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.  ప్రాజెక్టు  పూర్తి స్థాయి నీటి మట్టం 595 అడుగులు. అయితే ప్రస్తుత నీటి మట్టం 584 అడుగులకు  చేరింది.  సాగర్‌లో  312 టీఎంసీల నీటిని నిల్వ చేసే అవకాశం ఉంది. అయితే 300 టీఎంసీల మేరకు ఇప్పటికే నీరు చేరింది. 


 

Follow Us:
Download App:
  • android
  • ios