Asianet News TeluguAsianet News Telugu

ఖమ్మంలో విషాదం.. ఖాళీ స్థలంలో ఆడుకుంటుండగా చెట్టు కూలి.. ఇద్దరు చిన్నారులు మృతి...

అక్కడ ఉన్న ఓ చెట్టు కూలి.. పక్కనే ఉన్న గోడ మీద పడింది.దీంతో గోడ కూలింది. గోడ పక్కనే ఆడుకుంటున్న దింగాంత్ శెట్టి (11), రాజ్ పుత్ ఆయుష్ (6)లు గోడ కింద పడి మృతిచెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో ముగ్గురు చిన్నారులు ఖమ్మంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 

two children died in a tree falling accident in khammam
Author
Hyderabad, First Published Jan 19, 2022, 6:35 AM IST

ఖమ్మం : Khammam బ్రాహ్మణ బజార్ లో విషాదం చోటుచేసుకుంది. ఓ ఖాళీ స్థలంలో చిన్నారులు ఆడుకుంటుండగా భారీ tree కూలి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... మంగళవారం సాయంత్రం ఆరుగురు చిన్నారులు Brahmana Bazaar లోని open spaceలో ఆడుకునేందుకు వెళ్లారు ఈ క్రమంలో అక్కడ ఉన్న ఓ చెట్టు కూలి.. పక్కనే ఉన్న wall మీద పడింది.

దీంతో గోడ కూలింది. గోడ పక్కనే ఆడుకుంటున్న దింగాంత్ శెట్టి (11), రాజ్ పుత్ ఆయుష్ (6)లు గోడ కింద పడి మృతిచెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో ముగ్గురు చిన్నారులు ఖమ్మంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలాన్ని మేయర్ నీరజ, ఏఈ నర్సయ్య, అగ్నిమాపక అధికారులు పరిశీలించి సహాయక చర్యలు చేపట్టారు 

ఇదిలా ఉండగా, గత డిసెంబర్ లో తమిళనాడులో ఇలాంటి ఘటనలోనూ ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. Tamilnadu లోని Thirunelveli జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలకు చెందిన బాత్‌రూమ్ గోడ కూలి ముగ్గురు విద్యార్ధులు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.ఈ విషయం తెలిసిన వెంటనే  రెస్క్యూ బృందం సంఘటన స్థలానికి చేరుకొని  సహాయక చర్యలు చేపట్టారు.

గోడ కూలిపోవడంతో 9వ తరగతి చదివే అన్భళగన్, ఎనిమిదవ తరగతి చదివే విశ్వరంజన్, ఆరో తరతతి చదివే సుతేష్ లు మరణించారు. సంజయ్(8వతరగతి), ప్రకాష్ (9వ తరగతి),. షేక్ అబూబకర్ కిదానీ( 12వ తరగతి) అబ్దుల్లా (7వ తరగతి) లు గాయపడ్డారని పోలీసులు తెలిపారు.

మృతుల కుటుంబాలకు తమిళనాడు సీఎం స్టాలిన్ సానుఃభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు  ఒక్కొక్కరికి రూ. 10 లక్షలు, క్షతగాత్రులకు రూ.3 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది.  ఈ ఘటనపై  రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ పొయ్యమొళి స్పందించారు. ఈ ఘటనను దురదృష్టకరమన్నారు. ఈ పాఠశాలను తక్షణమే తనిఖీ చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. 100 ఏళ్లకుపైగా నడుస్తోన్న స్కూల్లో బిల్డింగ్స్, గోడలు శిథిలావస్థకు చేరుకున్నాయి. అయితే వీటిని మరమ్మత్తులు చేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపించారు. 

కాగా, అక్టోబర్ లోనూ ఇలాంటి ఘటనే తెలంగాణలోని గద్వాల్ లో జరిగింది.  jogulamba gadwal జిల్లా  అయిజ మండలం kothapallyలో ఓ ఇంటి గోడకూలి ఐదుగురు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అక్టోబర్ 10 నాడు తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకొంది. ఒకే ఇంటిలో ఏడుగురు నిద్రిస్తున్న సమయంలో   గోడకూలడంతో నిద్రలోనే ఐదుగురు ప్రాణాలు వదిలారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

కొత్తపల్లి గ్రామానికి చెందిన శాంతమ్మ, వారి పిల్లలు  తేజ, చరణ్ , రామ్, శాంతమ్మ భర్త  మోషలు మరణించారు. ఈ ఘటనలో మరో ఇద్దరు పిల్లలు స్నేహా, చిన్నాలకు తీవ్ర గాయాలయ్యాయి.  గాయపడిన ఇద్దరు చిన్నారులను గద్వాల ఆసుపత్రికి తరలించారు.

ఇటీవల కురిసన వర్షాలకు గోడ తడిసి కూలిపోయిందని స్థానికులు చెబుతున్నారు.  ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్లలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios