Asianet News TeluguAsianet News Telugu

హుజురాబాద్: వాట్సాప్‌ చాట్ వ్యవహారంలో ట్విస్ట్.. ఈటల పాదాలకు దళితుల పాలాభిషేకం, వీడియో వైరల్

హుజురాబాద్ నియోజకవర్గంలో బుధవారం రాత్రి నుండి ఈటల రాజేందర్ బావమరిది మధుసూధన్ రెడ్డి వాట్సప్‌ చాటింగ్ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. 

twist in huzurabad whatsapp chat issue ksp
Author
Huzurabad, First Published Jul 29, 2021, 5:20 PM IST

హుజరాబాద్ రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. వాట్సాప్ చాట్ ఎపిసోడ్ కొత్త మలుపు తిరిగింది. మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ పాదాలకు దళితులకు ఈటల పాలాభిషేకం చేశారు. ఆ తర్వాత దళితులకు పాలాభిషేకం చేశారు ఈటల రాజేందర్. దీనిపై ఈటల సతీమణి జమున స్పందించారు. కావాలనే తమపై కుట్రలు చేస్తున్నారని... తాము దళితుల్ని అవమానించలేదని ఆమె స్పష్టం చేశారు. మరోవైపు తమపై ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు దళితులు. ధర్మారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఈటల దిష్టిబొమ్మను దగ్థం చేశారు దళిత సంఘం నేతలు. దళితులకు ఈటల క్షమాపణలు చెప్పాలని , చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

మరోవైపు ఈ వ్యహారంపై ఈటల రాజేందర్ స్పందించారు. కేసీఆర్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. మాదిగల మీటింగ్‌కు పోతే తనను రాజేందర్ మాదిగ అని పిలిచేవారని.. దళిత బిడ్డలను ఏసీ బస్సుల్లో ఎస్కార్ట్ పెట్టి ప్రగతి భవన్‌కు తీసుకెళ్లారని రాజేందర్ అన్నారు. తన రాజీనామా తర్వాతనే కేసీఆర్ దళితులకు గౌరవం ఇస్తున్నారని ఆయన గుర్తుచేశారు. 2023లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఈటల ధీమా వ్యక్తం చేశారు. 

ALso Read:జమున రెడ్డిని హుజురాబాద్ లో తిరగనివ్వం... ఈటలను ఓడించి తీరతాం: గజ్జెల కాంతం హెచ్చరిక (వీడియో)

కాగా, హుజురాబాద్ నియోజకవర్గంలో బుధవారం రాత్రి నుండి ఈటల రాజేందర్ బావమరిది మధుసూధన్ రెడ్డి వాట్సప్‌ చాటింగ్ స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈటల భార్య జమునారెడ్డి, ఆమె సోదరుడు మధుసూధన్ రెడ్డిలు వందమంది కార్యకర్తలతో కలిసి హుజురాబాద్ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios