Asianet News TeluguAsianet News Telugu

బంజారాహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో మ‌రో ట్విస్ట్‌.. మూడు పబ్బుల్లో పార్టీలు చేసుకుని, డ్రైవింగ్

హైదరాబాద్ (hyderabad police) బంజారాహిల్స్‌లో (banjara hills road accident) ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రమాదానికి కారణమైన మందుబాబులు రోహిత్ (rohit) , సుమన్‌లు (suman) ఘటన జరగడానికి ముందు మూడు పబ్బుల్లో పార్టీ చేసుకున్నట్లు గుర్తించారు పోలీసులు.

twist in banjara hills road accident case
Author
Hyderabad, First Published Dec 7, 2021, 3:40 PM IST

హైదరాబాద్ (hyderabad police) బంజారాహిల్స్‌లో (banjara hills road accident) ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ప్రమాదానికి కారణమైన మందుబాబులు రోహిత్ (rohit) , సుమన్‌లు (suman) ఘటన జరగడానికి ముందు మూడు పబ్బుల్లో పార్టీ చేసుకున్నట్లు గుర్తించారు పోలీసులు. ఈ మేరకు మూడు పబ్బుల్లో సీసీ కెమెరాలు ఫుటేజ్ సేకరించారు పోలీసులు. పబ్ నుండి బయటకి రాగానే బంజారాహిల్స్ హోటల్‌లో ఉండేందుకు రోహిత్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో రోహిత్‌పై 304 (2) , సుమన్ పై 109 ఐపీసీ కింద కేసులు నమోదు చేశారు పోలీసులు.

ప్రమాదం తరువాత పోలీసుల కళ్లుగప్పి పరారైయ్యారు రోహిత్, సుమన్. అయితే… ఆ ఇద్దరిని ఛేజ్ చేసి పట్టుకున్నారు పోలీసులు. ఈ సంద‌ర్భంగా వెస్ట్ జోన్ జాయింట్ సీపీ ఏఆర్ శ్రీనివాస్ మ‌ట్లాడుతూ… బంజారాహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. ఈ కేసులో టెక్నీకల్ ఏవిడెన్స్ ఆధారంగా ఆధారాలు సేకరించి, ఛార్జ్ షీట్ వేస్తామని వెల్లడించారు. వెస్ట్ జోన్‌లో పబ్ లు, బార్‌లు‌పై కూడా నిఘా ఉంటుందని… మద్యం సేవించి వాహనాలు నడిపితే ఇక నుండి కఠినంగా వ్యవహరిస్తామ‌ని వెల్ల‌డించారు. ఎక్కువ గా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో యూత్ పట్టుబడుతున్నారన్నారు. వారి తల్లిదండ్రులు కూడా పిల్లలపై నిఘా ఉంచాలని పేర్కొన్నారు. ఈ కేసులో పక్కా ఆధారాలతో ఛార్జ్ షీట్ వేసి నిందితులకు శిక్ష పడేలా చేస్తామ‌న్నారు.

ALso Read:హైదరాబాద్‌లో మరో ఇద్దరిని బలికొన్న మందుబాబులు.. నార్సింగిలో జరిగిన ప్రమాదంలో దంపతుల మృతి..

కాగా.. ఆదివారం అర్ధరాత్రి బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 2లో వేగంగా దూసుకొచ్చిన కారు రోడ్డుపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను అయోధ్యరాయ్‌, దేవేంద్రకుమార్‌ దాస్‌గా గుర్తించారు. వారిద్దరు నగరంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో పనిచేస్తున్నారు. కారు నడుపుతున్న వ్యక్తి ఉప్పల్‌కు చెందిన రోహిత్ గౌడ్‌గా కనుగొన్నారు. ప్రమాదం జరిగినప్పుడు అతడు మద్యం మత్తులో ఉన్నాడని పోలీసులు తెలిపారు. కారును సీజ్ చేశామని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.  

Follow Us:
Download App:
  • android
  • ios