సంగారెడ్డి జిల్లాలో కలకలం రేపిన ఎయిర్ గన్ మిస్ ఫైర్ కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఆ పాప మరణం ప్రమాదవశాత్తు కాదని.. కావాలనే హత్య చేశారని పోలీసులు తేల్చారు. 

సంగారెడ్డి : air gun పేలి 4 years girl మృతి చెందిన కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతిపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న క్రమంలో తాజాగా ఈ కేసులో కొత్త twist తెరమీదికి వచ్చింది. ఎయిర్ గన్ పేరుతో మృతి చెందిన నాలుగు ఏళ్ల చిన్నారిని murder చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఉద్దేశపూర్వకంగానే దగ్గర నుంచి కాల్చినట్లు పోలీసులు గుర్తించారు.

 సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాల గ్రామంలో ఓ ఫామ్హౌస్లో ఎయిర్ గన్ పేలి శాన్వి అనే నాలుగు సంవత్సరాల పాప మృతి చెందిన విషయం తెలిసిందే. మరోవైపు మృతి చెందిన చిన్నారి మృతదేహం ఇంకా ఉస్మానియా ఆసుపత్రి మార్చురీ లోనే ఉంది. గురువారం ఆస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు ఈ కేసులో నిందితులను పటాన్చెరు పోలీస్ స్టేషన్లో మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఘటనపై డిఎస్పి భీమ్ రెడ్డి వివరాలు వెల్లడించారు.

‘మార్చి 16న 12 గంటల సమయంలో జిన్నారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు వచ్చింది. ప్రసాద్ ఫామ్హౌస్లో నాగరాజు అనే వ్యక్తి వాచ్మెన్ గా పని చేస్తున్నాడు. ఆన్లైన్లో రూ. 26 వేలకు ఎయిర్ గన్ ప్రసాద్ కొనుగోలు చేశాడు. దాన్ని నిర్లక్ష్యంగా తన ఫాంహౌస్లో వాచ్మెన్ గదిలో ఉంచాడు. ఎయిర్ గన్ లైసెన్స్ అవసరం లేదు. నాగరాజు ఇంటికి బంధువులు వచ్చారు. 17 ఏళ్ల యువకుడు గన్ తో ఆడుతూ ఫైర్ చేసాడు. దీంతో అటు వైపు వస్తున్న నాలుగేళ్ల బాలికకు పిల్లెట్ తగిలింది. పిలక నీటిమీద తగలడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ బాలిక మృతి చెందింది. 17 ఏళ్ళ బాలుడిని, ప్రసాద్ ని అదుపులోకి తీసుకున్నారు. 109,176 సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం’ అని డీఎస్పీ తెలిపారు. 

కాగా, బుధవారం తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఎయిర్ గన్ పేలి ఓ బాలిక మరణించింది. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం వావిలాలలో గల ఓ ఫాంహౌస్ లో ఈ సంఘటన జరిగింది. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హైదరాబాదులోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పిల్లలు గన్ తో ఆడుకుంటుండగా ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, సైదాబాద్ లో వరకట్న వేదింపులు ఓ డాక్టర్ ప్రాణాలు తీశాయి. ఇరువురిదీ second marriage. వరకట్న వేధింపులు తట్టుకోలేక భార్య ఉరేసుకుని Suicide చేసుకున్న ఘటన ఈ నెల 8న మలక్ పేట ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. భర్తను ఈనెల 14న అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. పోలీసుల వివరాల మేరకు.. నల్గొండ జిల్లా దామరచర్లవాసి గంగనపల్లి కాశీ విశ్వనాథం కుమార్తె, వైద్యురాలైన కుమార్తె స్వప్న (38) తొలి వివాహం మహబూబ్ నగర్ కు చెందిన వ్యక్తితో చేశారు. ఖమ్మం జిల్లా పీహెచ్ సీలో పనిచేస్తున్న క్రమంలో అనివార్య కారణాలతో Divorce తీసుకుంది.కర్నూలుకు చెందిన డాక్టర్ ఎం.శ్రీధర్ తో 2015 ఏప్రిల్ లో రెండు వివాహం జరిగింది. రూ.10లక్సల నగదు, 14 తులాల బంగారం కట్నం కింద అందజేశారు. ఇంట్లో సగ భాగం, తల్లి బంగారు నగలు తీసుకురావాలని శ్రీధర్ పలుమార్లు ఒత్తడి తెచ్చాడని ఆమె తండ్రి పోలీసులకు వివరించారు. ఈనెల 8న స్వప్న ఆత్మహత్య చేసుకుందని శ్రీధర్ సమాచారం ఇవ్వడంతో అనుమానంవచ్చి ఠాణాలో ఫిర్యాదు చేశాడు. డాక్టర్ శ్రీధర్ ను ఈ నెల 14 అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని మలక్ పేట ఏసీపీ ఎన్. వెంకటరమణ పేర్కొన్నారు.