టీఆర్ఎస్ పార్టీలో చేరిన సీనియర్ యాక్టర్...

https://static.asianetnews.com/images/authors/3800b66b-dc46-549b-a35e-91a1dbfb7895.jpg
First Published 8, Sep 2018, 11:26 AM IST
tv serial actor joined in trs party
Highlights

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తెలంగాన రాజకీయాలు వేడెక్కాయి. పార్టీలన్ని ఎన్నికల సమరానికి సిద్దమవుతున్నాయి. ఈ సమయంలో టీఆర్ఎస్ పార్టీ కాస్త దూకుడును ప్రదర్శిస్తోంది. ఎన్నికల్లో గెలుపుకు దోహదపడే ఏ ప్రయత్నాన్ని ఆ పార్టీ నాయకులు వదలడం లేదు. ఈ ప్రయత్నాల్లో భాగంగా ఓ బుల్లితెర నటున్ని టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకుని మరికొంత సినీ గ్లామర్ ని అందించారు.

తెలుగు టీవి సీరియల్ నటుడు, యాంకర్ జేఎల్ శ్రీనివాస్ టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఖమ్మం ప్రాంతానికి చెందిన ఇతడు స్థానిక సీనియర్ నాయకుడు, ఆపద్దర్మ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సమక్షంలో టీఆర్ఎస్ లో చేరాడు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... కేసీఆర్ చేపట్టిన సుపరిపాల వల్ల రానున్న ఎన్నికల్లో మళ్లీ టీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడం ఖాయమన్నారు. 

అనంతరం శ్రీనివాస్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు చేరుకుని అక్కడ మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ గెలుపుకోసం తమ బృందం ప్రచారం చేస్తుందన్నారు. కేసీఆర్ ప్రజా పాలనకు ఆకర్షితమై టీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు స్పష్టం చేశాడు. హైదరాబాద్ ఫిలింనగర్ ఏర్పడినట్లే టీవినగర్ కూడా ఏర్పడాలని తాను కోరుకుటంటున్నట్లు శ్రీనివాస్ తెలిపారు.

loader