తన భర్త శ్రీధర్ రెడ్డి , అతని ప్రియురాలి వేధింపుల వల్లే తాను ఆత్మహత్యాయత్నం చేసినట్లు టీవీ నటి మైథిలి పోలీసులకు తెలిపారు. ప్రస్తుతం నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పోలీసులకు ఈ మేరకు వాంగ్మూలం ఇచ్చారు. 

టీవీ నటి మైథిలి (tv actress maithili) ఆత్మహత్యాయత్నం కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిమ్స్‌లో (nims hospital) చికిత్స పొందుతున్న మైథిలి సంచలన అంశాలు వెల్లడించింది. తన భర్త సామా శ్రీధర్ రెడ్డి, అతని ప్రియురాలు తనను చంపేందుకు కుట్ర పన్నారని ఆరోపించింది. ప్లాన్ ప్రకారం తనను మానసికంగా హింసించారని వాపోయింది మైథిలి. తాను సంపాదించిన ఆస్తులు, నగలను కాజేశారని ఆమె ఆరోపించింది. భర్త శ్రీధర్ రెడ్డి, అతని ప్రియురాలి వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్యాయత్నం చేసినట్లు వెల్లడించింది. 

కాగా.. పంజాగుట్ట పోలీసుస్టేషన్‌ (panjagutta police station) పరిధిలో సోమవారం రాత్రి మైథిలి ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. తన భర్త వాహనాన్ని సీజ్‌ చేయాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని పంజాగుట్ట పోలీసులకు మైథిలి ఫోన్‌ చేసింది. 8 బీజర్లు, రెండు స్లీపింగ్‌ ట్యాబెట్స్‌ మింగి మైథిలి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఆమె ఇంటికి చేరుకుని మైథిలిని నిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు.

Also Read:హైద్రాబాద్ లో టీవీ నటి మైథిలి ఆత్మహత్యాయత్నం: నిమ్స్ లో చికిత్స

మరోవైపు.. తన భర్త వేధిస్తున్నాడని మైథిలి 6 నెలల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలో మోతే పీఎస్‌లో భర్తపై ఫిర్యాదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. తన భర్తపై చర్యలు తీసుకోవాలని తాజాగా పంజాగుట్ట పోలీసులకు ఫోన్ చేసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నారు.