హైదరాబాద్: టీవీ సీరియల్ నటి లలిత వారం రోజులుగా కన్పించడం లేదు. లలిత ఫోన్ స్విచ్చాఫ్ చేసి ఉందని  తల్లిదండ్రులు చెబుతున్నారు. తమ కూతురు కన్పించడం లేదని  తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఎస్‌ఆర్ నగర్  హాస్టల్‌లో లలిత ఉంటుంది. కొంత కాలంగా ఆమె టీవీ సీరియల్స్‌లో నటిస్తుంది. వారం రోజులుగా ఆమె ఆచూకీ లేకుండా పోయింది.ఈ విషయమై హాస్టల్‌కు వచ్చి తల్లిదండ్రులు ఆరా తీశారు. 

వారం రోజుల క్రితమే హాస్టల్‌ నుండి లలిత వెళ్లిపోయిందని చెబుతున్నారు. ఓ గుర్తు తెలియని వ్యక్తి లలితను తీసుకెళ్లినట్టుగా హాస్టల్  సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. తమ కూతురు ఆచూకీ కన్పించకుండాపోయిందని  తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. లలిత  స్వస్థలం అనంతపురం జిల్లా ధర్మవరం.