శ్రీలంక ఉగ్రదాడిలో చనిపోయిన హైదరాబాద్ వాసి తులసీరాం మృతదేహం స్వస్థలానికి చేరుకుంది. కొలంబోలోని హోటల్ లో ఇటీవల వరస బాంబు పేలుళ్లు సంభవించిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ పేలుళ్లలో తులసీరాం చనిపోగా... ఆయన స్నేహితుడు శ్రీనివాస్ కి తీవ్రగాయాలయ్యాయి. 

తులసీరాం మృతితో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తులసీరాం ఆస్ట్రేలియాలో పైలెట్ గా శిక్షణ పొందారు. ఆయన కుటుంబం అమీర్ పేటలో నివాసం ఉంటోంది. గత శనివారం స్నేహితులతో కలిసి కొలంమోకి వెళ్లిన తులసీరాం.. శవమై ఇంటికి చేరాడు.