పాఠాలు బోధించాల్సిన టీచర్ ప్రేమ పాఠాలు వల్లె వేశాడు.. తన దగ్గరికి ట్యూషన్ కి వచ్చే విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఇది వెలుగులోకి రావడంతో తల్లిదండ్రుల చేతుల్లో దేహశుద్ధి జరిగింది.
పటాన్ చెరు : అమ్మాయిలు కనిపిస్తే చాలు కామంతో కళ్లుమూసుకుపోయి రెచ్చిపోయే కీచకులు ఎక్కువవుతున్నారు. దైవంతో సమానంగా గౌరవించే గురువులు ఈ నీచ కార్యానికి దిగజారుతుండడం దారుణమైన విషయం. అలాంటి ఘటన పటాన్ చెరూలో చోటు చేసుకుంది.
విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించి Sexual harassmentకు గురి చేస్తున్న ట్యూషన్ టీచర్ ను స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసిన ఘటన Patan Cheru పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆ తర్వాత అతడిని పోలీసులకు అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రైవేటు పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్న సాల్మన్ రాజు పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామంలో Tuition Center నిర్వహిస్తున్నాడు.
స్థానిక ప్రాథమిక విద్య చదువుతున్న విద్యార్థులు ట్యూషన్ కి వెళ్తున్నారు. సోమవారం ఓ బాలిక ట్యూషన్ కి వెళ్లకుండా ఇంటివద్దే ఉండగా తండ్రి నిలదీయడంతో టీచర్ వేధిస్తున్న విషయం బయటపడింది. స్థానికులు, మహిళలతో కలిసి ట్యూషన్ సెంటర్ నిర్వాహకుడు సాల్మన్ రాజు నిలదీసి దేహశుద్ధి చేశారు. పోలీసులకు సమాచారం అందించగా అదుపులోకి తీసుకున్నారు. స్థానికులు కొట్టిన దెబ్బలకు నిందితుడు గాయపడగా పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదిలా ఉండగా, మార్చి 4న RTC Busలో ప్రయాణిస్తున్న తనతో driver అసభ్యంగా ప్రవర్తించినట్లు ఓ మహిళా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. బాధిత మహిళ వివరాల ప్రకారం… బంధువుల శుభకార్యానికి నెల్లూరుకు వచ్చి తిరిగి స్వగ్రామం వెళ్లేందుకు బుధవారం రాత్రి Nellore-Visakhapatnam ఇంద్ర ఏసీ బస్సుల్లో అనకాపల్లి వరకు టికెట్ తీసుకుని ఎక్కినట్లు తెలిపారు. బస్సులో మొత్తం ముగ్గురు ప్రయాణికులే ఉన్నారన్నారు. ఒంగోలు తర్వాత డ్యూటీ మారిన డ్రైవర్ తన పక్క సీట్లో కూర్చుంటుండగా.. అన్ని సీట్లు ఖాళీ ఉంటే ఇక్కడ ఎందుకు కూర్చుంటున్నారు? అని అభ్యంతరం వ్యక్తం చేశానని చెప్పారు. ఫోన్ చార్జింగ్ కోసం కూర్చున్నట్లు తెలిపారని చెప్పారు.
బస్సు లో దీపాలు తీసేసిన తర్వాత తనతో డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె చెప్పారు. దీంతో వెనక సీట్ లో ఉన్న వృద్ధ ప్రయాణికుడిని సహాయం కోరగా.. అతను పక్షవాతంతో బాధపడుతున్నానని, సాయం చేయలేనని చెప్పాడని అన్నారు. దీంతో ఫోన్ ద్వారా అనకాపల్లిలోని భర్తకు సమాచారం ఇచ్చినట్లు ఆమె వివరించారు. తెలిసిన వారి ద్వారా బస్సు విజయవాడ బస్ స్టేషన్ కు చేరుకున్నాక డ్రైవర్ పై ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
విధుల నుంచి తొలగింపు..
అసభ్యంగా ప్రవర్తించిన డ్రైవర్ ఎ.జనార్ధన్ ను అధికారులు తక్షణం విధుల నుంచి తప్పించారు. మరో డ్రైవర్ ను ఏర్పాటు చేసి గురువారం జరిగిన తెల్లవారుజామున 1:00 సమయంలో బస్సును పంపారు. ప్రయాణికురాలి ఫిర్యాదు మేరకు ఘటనకు కారణమైన డ్రైవర్పై ఆర్టీసీ విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
