Asianet News TeluguAsianet News Telugu

టికెట్, పదవి ఇస్తానని కేసీఆర్ ఆఫర్ ఇచ్చారు...కానీ..: ఎల్. రమణ

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ  తనను చాలాసార్లు ప్రలోభాలకు గురిచేసిందని టిటిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ ఆరోపించారు. అయితే వారి ప్రలోభాలకు లొంగకుండా తాను తెలంగాణలో టిడిపి పార్టీ బలోపేతం కోసం కృషి చేసినట్లు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ పదవులు, టికెట్ ఆఫర్ కు తాను లొంగలేదని రమణ వెల్లడించారు. నాకు వాటికంటే పార్టీ, ప్రజలే ఎక్కువని రమణ స్పష్టం చేశారు.

TTDP President L Ramana Fires On CM KCR
Author
Hyderabad, First Published Sep 25, 2018, 2:51 PM IST

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ  తనను చాలాసార్లు ప్రలోభాలకు గురిచేసిందని టిటిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ ఆరోపించారు. అయితే వారి ప్రలోభాలకు లొంగకుండా తాను తెలంగాణలో టిడిపి పార్టీ బలోపేతం కోసం కృషి చేసినట్లు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ పదవులు, టికెట్ ఆఫర్ కు తాను లొంగలేదని రమణ వెల్లడించారు. నాకు వాటికంటే పార్టీ, ప్రజలే ఎక్కువని రమణ స్పష్టం చేశారు.

తెలంగాణ అభివృద్ది కోసం ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు తాపత్రయపడ్డారని రమణ తెలిపారు. అందులో బాగంగానే బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోడానికి ప్రయత్నించినట్లు రమణ వివరించారు. 

తెలంగాణ లో టీఆర్ఎస్ పార్టీని ఓడించడమై లక్ష్యంగా ప్రతిపక్షాలన్నీ కలిసి మహాకూటమిగా ఏర్పడ్డాయన్నారు. జగిత్యాల నుండి ఈ మహాకూటమి జైత్రయాత్ర  ప్రారంభించనున్నట్లు రమణ ప్రకటించారు. తెలంగాణలో మహాకూటమి జెండా ఎగరవేయడం ఖాయమని అన్నారు రమణ.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ అవినీతి పాలన సాగిస్తున్నట్లు రమణ ఆరోపించారు. రాఫెల్ యుద్ద విమానాల కోనుగోళ్ల ఒప్పందంలో రూ. 40 వేల కోట్ల స్కాం జరిగిందన్నారు. 

 కేసీఆర్ ఐదేళ్లు కూడా పరిపాలన అందించలేక ముందస్తుకు వెళ్లడాన్ని రమణ ప్రశ్నించారు. ఎన్నికల కమీషన్ నిర్ణయించాల్సిన షెడ్యూల్ గురించి కేసీఆర్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని రమణ ఎద్దేవా చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios