తెలంగాణ టిడిపి పోరుబాట పట్టింది. సిఎం కేసిఆర్ వైఖరిని నిరసిస్తూ ఆ పార్టీ ఆధ్వర్యంలో ప్రగతిభవన్ ముట్టడి చేపట్టింది. భారీగా నాయకులు, కార్యకర్తలు ప్రగతిభవన్ వద్ద ఆందోళనకు దిగి అరెస్టయ్యారు. కొందరిని ఇంటి వద్దే ఉదయం నుంచి పోలీసులు అరెస్టుల పర్వం కొనసాగించారు. అరెస్టయిన వారందరినీ గోషామహల్ స్టేడియం తరలించారు. ఒంటేరు ప్రతాపరెడ్డిని విడుదల చేసే వరకు గోషామహల్ స్టేడియం నుంచి కదిలేది లేదని తేల్చి చెప్పారు. తెలంగాణ అంతటా అన్ని పోలీసు స్టేషన్లలోనే నాయకులు, కార్యకర్తలందరం బైటాయించి ఆందోళన చేస్తామన్నారు.

అయితే రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఒంటేరు ప్రతాపరెడ్డి అరెస్టు విషయంలో గవర్నర్ అపాయింట్ మెంట్ ఇచ్చారు. అయితే ఒంటేరు అరెస్టు పంచాయతీ గవర్నర్ వద్దే తేల్చుకోవాలని టిడిపి తెలంగాణ నేతలు డిసైడ్ అయ్యారు. ఇక గవర్నర్ తో సమావేశం అవుతున్న తరుణంలో తమ ఆందోళనను ప్రస్తుతానికి విరమించారు టిడిపి నేతలు. ఒంటేరు ప్రతాపరెడ్డి అరెస్టు విషయంలో ఆలస్యంగానే స్పందించినప్పటికీ తెలంగాణ తెలుగు దేశం పార్టీ పంచాయతీ మాత్రం గవర్నర్ వద్దకు తీసుకుపోయగలిగింది. టిడిపి తెలంగాణ అధ్యక్షులు రమణ మాట్లాడిన వీడియో కింద చూడండి.