తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమయ్యారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో సమ్మె తేదీని ప్రకటించనున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు మరికొన్ని సమస్యలను పరిష్కరించాలని టీఎస్ ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.

దీనిలో భాగంగా కొద్దివారాల క్రితం ఆర్టీసీ ఎండీని కలిసి వినతిపత్రం సమర్పించారు. అక్టోబర్ 4న లేబర్ కమీషనర్ పిలుపునిచ్చిన నేపథ్యంలో అంతకంటే ముందుగానే సమ్మెలోకి దిగాలని కార్మిక సంఘాలు భావిస్తున్నాయి.