TSRTC: క్రికెట్ అభిమానులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త..
TSRTC:హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా నేటీ నుండి భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మొదటి టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించాలని చాలా మంది అభిమానులు భావిస్తున్నారు. ఈ క్రమంలో క్రికెట్ అభిమానులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ ఆర్టీసీ) శుభవార్త చెప్పింది.
TSRTC: క్రికెట్ అభిమానులకు శుభవార్త చెప్పింది. నేటీ నుండి హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఉత్కంఠభరితమైన టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ వీక్షించేందుకు వెళ్తున్న క్రికెట్ అభిమానులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ మ్యాచ్ చూసేందుకు వెళ్తున్న క్రికెట్ అభిమానుల రాకపోకలకు ఇబ్బంది కలుగకుండా ఏర్పాటు చేసింది.
ఈ మేరకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపనున్నది. జనవరి 25 నుంచి 29 వరకు (ఐదు రోజుల పాటు) నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియంకు వెళ్లేందుకు 60 ప్రత్యేక బస్సులను నడపనుంది. ఆర్‌జిఐసి స్టేడియం మీదుగా ఉప్పల్‌కు సాధారణ సర్వీసులతో పాటు మ్యాచ్ కోసం ఈ ప్రత్యేక బస్సులను నడుపనున్నట్టు తెలిపింది.
ఈ నేపథ్యంలో TSRTC MD VC సజ్జనార్ తన ట్విటర్ (ఎక్స్) వేదిక సమాచారమిస్తూ.. ‘క్రికెట్ అభిమానులకు శుభవార్త! ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో రేపటి నుంచి ఐదు రోజుల పాటు భారత్ వర్సెస్ ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా TSRTC ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి స్టేడియంకు 60 బస్సులు నడపనున్నారు. ఈ బస్సులు ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు ప్రారంభమై.. తిరిగి స్టేడియం 7 గంటల వరకు స్టేడియం నుంచి ఈ బస్సులు బయలుదేరుతాయి. మ్యాచ్‌ని వీక్షించేందుకు ఈ ప్రత్యేక బస్సులను ఉపయోగించుకోవాల్సిందిగా క్రికెట్ అభిమానులను TSRTC అభ్యర్థిస్తోంది” అని వెల్లడించారు